విశాఖ వేదికగా ఏపీ సైన్స్ కాంగ్రెస్

  

Last Updated : Nov 5, 2017, 06:12 PM IST
విశాఖ వేదికగా ఏపీ సైన్స్ కాంగ్రెస్

విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయ వేదికగా జరిగే ఆంధ్రప్రదేశ్ సైన్సు కాంగ్రెసు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నవంబరు 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఏయూ సెనేట్ మందిరంలో జరిగే ఈ కాంగ్రెస్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 ప్రతినిధులు హాజరవుతున్నారు.

అలాగే 60 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు తన ప్రసంగాలను అందిస్తారు.  ఇదే కార్యక్రమంలో భాగంగా జరిగే చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ 7వ తేదీన ఉదయం 9 గంటలకు ఏయూ టీఎల్‌ఎన్ సభామందిరంలో ప్రారంభమవుతుంది. చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌‌లో 150 పాఠశాలలు పాలుపంచుకోనున్నాయి.

ఈ ఏపీ సైన్స్ కాంగ్రెస్‌లో 10 మంది యువ శాస్త్రవేత్తలకు పురస్కార ప్రదానం జరుగుతుంది. సివి రామన్ అవార్డు, ఎన్ జీ రంగా అవార్డు, మేడమ్ క్యూరీ అవార్డు మొదలైన పురస్కారాలను ఈ కార్యక్రమంలో యువ శాస్త్రవేత్తలకు అందివ్వనున్నట్లు కాంగ్రెస్ నిర్వాహకులు ప్రకటించారు.

ఈ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా జరిగే మూడు రోజుల ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏయూ ప్లాటినమ్ జూబ్లీ గెస్టుహౌస్ వద్ద జరుగుతుంది. గతంలో సైన్స్ కాంగ్రెస్‌ను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మొదలైన యూనివర్సిటీలు నిర్వహించాయి. ఈ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించడానికి ప్రభుత్వం 50 లక్షలు కేటాయించింది. 

Trending News