AP SEC: ఆ ఇంటి విషయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మోసం చేశారా

AP SEC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వివాదాస్పదమయ్యారు. హైదరాబాద్ లో నివాసముంటున్న ఇంటి వ్యవహారమై పంచాయితీ ఇప్పుడు గవర్నర్ వద్దకు చేరింది. ఈ సమస్య నుంచి నిమ్మగడ్డ ఎలా బయటపడతారో చూడాలి.

Last Updated : Dec 15, 2020, 11:29 AM IST
  • ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మరో వివాదం
  • ఏపీలో నివాసముండకుండా హౌస్ అలవెన్స్ పొందుతున్నారని గవర్నర్ కు ఫిర్యాదు
  • ఆర్టీఐ చట్టం ప్రకారం సేకరించిన వివరాలతో గవర్నర్ కు
AP SEC: ఆ ఇంటి విషయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మోసం చేశారా

AP SEC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వివాదాస్పదమయ్యారు. హైదరాబాద్ లో నివాసముంటున్న ఇంటి వ్యవహారమై పంచాయితీ ఇప్పుడు గవర్నర్ వద్దకు చేరింది. ఈ సమస్య నుంచి నిమ్మగడ్డ ఎలా బయటపడతారో చూడాలి.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ( Ap local body elections ) విషయంలో  రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec nimmagadda ramesh kumar ) మరో వివాదంలో చిక్కుకున్నారు. హౌస్ అలవెన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని( Ap government ) మోసం చేస్తున్నారని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ( Ap governor vishwa bhushan harichandan )కు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ ఫిర్యాదు చేసింది. 

ఆర్టీఐ చట్టం ( RTI Act ) ద్వారా తెలిసిన వివరాల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్  ప్రభుత్వం నుంచి నెలకు 3 లక్షల 19 వేల 250 రూపాయల వేతనం పొందుతున్నారు. అయినా రాష్ట్రంలో ఉండకుండా హైదరాబాద్ లోనే నివాసముంటున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న నివాసానికి హౌస్ అలవెన్స్ పొందుతున్నారు. ఏపీ (AP )లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ..ఏపీ ప్రభుత్వం నుంచి జీతం, ఇంటి అద్దె అలవెన్సు పొందుతూ..ఏపీలో నివసించకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ సంస్థ. ఆర్టీఐ చట్టం ప్రకారం పొందిన వేతన వివరాల్ని ఇతర ఆధారాల్ని ఫిర్యాదుకు జత చేర్చారు. 

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు, అధికార్లకు ఆదర్శంగా ఉండాలని..ఇలా మోసం చేయకూడదని ఫిర్యాదు దారులు తెలిపారు. రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి ( Amaravati )కి మారినప్పుడు..సరైన సౌకర్యాలు లేనప్పటికీ  రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర అధికారులు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్న సంగతిని ఫిర్యాదుదారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం విజయవాడకు నివాసం మార్చకుండా..హైదరాబాద్ లోనే ఉంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు సమర్పిస్తూ..రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

Also read: AP: ఇంటర్మీడియెట్ అన్ని ఫీజులు రద్దు చేసిన ప్రభుత్వం

Trending News