APPSC Group 2 Hall Tickets: గ్రూప్ 2 హాల్ టిక్కెట్లను నేటి నుంచి అందుబాటులో ఉంచనుంది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. http://www.psc.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 25 న గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించి 24 జిల్లాలలో కేంద్రాలను ఏర్పాట్లు చేశారు.
గతేడాది డిసెంబరులో 897 గ్రూప్-2 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా మరో రెండు పోస్టులను యాడ్ చేసింది. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. జనవరి 24 వరకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్టులకు మొత్తం 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 537 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమ్స్ వాయిదా పడుతుందని.. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. అనుకున్న డేట్ కే ఎగ్జామ్ జరుగుతుందని.. తప్పుడు వదంతులని నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది.
Also Read: Liquor ban: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ నగరంలో 4 రోజులపాటు లిక్కర్ బ్యాన్..!
గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ సారి స్క్రీనింగ్ పరీక్షలో ఐదు సబ్జెక్టులను పొందుపరిచారు. ఇందులో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సోసైటీ, కరెంట్ ఆఫైర్స్ మరియు మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. ప్రతి సబ్జెక్టు 30 మార్కుల చొప్పున మెుత్తం 150 మార్కులకు ఎగ్జామ్ జరగనుంది.
Also Read: UPSC 2024: సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు రేపటి నుంచే రిజిస్ట్రేషన్.. లాస్ట్ డేట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి