Liquor ban: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ నగరంలో 4 రోజులపాటు లిక్కర్ బ్యాన్..!

Bengaluru: బెంగళూరులో మద్యం అమ్మకాలపై నిషేధం నేటి నుండి అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. అసలు బెంగుళూరులో లిక్కర్ బ్యాన్ ఎందుకు విధించారో తెలియాంటే ఈ స్టోరీ చదివేయండి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2024, 12:30 PM IST
Liquor ban: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ నగరంలో 4 రోజులపాటు లిక్కర్ బ్యాన్..!

Liquor ban in Bengaluru: కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బెంగళూరులో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ లిక్కర్ బ్యాన్ బెంగళూరులో ఈరోజు నుంచే అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. 

కర్ణాటక శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఒక స్థానానికి శుక్రవారం ఉప ఎన్నికను నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) షెడ్యూల్ జారీ చేసింది. గత ఏడాది మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్సీ పుట్టన్న శాసనమండలికి, బీజేపీకి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. రాజాజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్ సురేష్ కుమార్ చేతిలో పుట్టన్న ఓడిపోయారు. 

పోలింగ్ ఎప్పుడంటే?
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా..ఫిబ్రవరి 20, మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాలుగు రోజుల పాటు మద్యం విక్రయాలను నిషేధించాలని అధికారులు నిర్ణయించారు. బెంగళూరులోని పోలీసు కమిషనర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు మినహా రాష్ట్ర రాజధానిలోని అన్ని ప్రాంతాల్లో ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలపై బ్యాన్ ఉంటుంది.

Also Read: JEE Main 2024 Session 1 Results: జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు విడుదల, అగ్రస్థానం తెలుగు రాష్ట్రాలకే

ప్రేమ జంటలకు ఇబ్బందే..
యువకులు, ప్రేమ జంటలు పార్టీలు మరియు హ్యాంగ్‌అవుట్‌లను ప్లాన్ చేసుకునే ప్రేమికుల రోజున మద్య నిషేధం అమలులోకి రావడంతో యువత తీవ్రనిరాశ చెందుతున్నారు. అయితే నిషేధం ప్రేమికుల దినోత్సవానికి కాదని.. బెంగళూరు టీచర్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించినదని అధికారులు తెలిపారు.
కోట్లలో నష్టం..
నాలుగు రోజుల నిషేధం కారణంగా నగరంలోని పబ్‌లు మరియు బార్‌లు భారీ నష్టాలను చవిచూస్తాయని తెలుస్తోంది. సుమారు రూ .500 కోట్లు వరకు నష్టం రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరు సిటీ డిస్ట్రిక్ట్ లిక్కర్ ట్రేడర్స్ అసోసియేషన్ (బీసీడీఎల్టీఏ) నగరంలో నాలుగు డ్రై డేలు విధించడంపై పునరాలోచించాలని ఈసీఐకి లేఖ రాసింది. ఈ బ్యాన్ ప్రభావం దాదాపు 3,700 సంస్థలపై పడుతుందని.. ఎక్సైజ్ సుంకం పరంగా కూడా రాష్ట్రానికి రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అసోసియేషన్ వెల్లడించింది. 

Also Read: UPSC 2024: సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు రేపటి నుంచే రిజిస్ట్రేషన్.. లాస్ట్ డేట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News