AP: అత్యంత ఘనంగా తుంగభద్ర నది పుష్కరాలు, ప్రారంభమైన ఏర్పాట్లు

నదీనదాలకు పుష్కరాలనేవి అనాది వస్తున్న సాంప్రదాయం. గురుడు ఒక్కోరాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలనేవి వస్తుంటాయి. ఇప్పుడు తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. 

Last Updated : Oct 17, 2020, 09:12 PM IST
AP: అత్యంత ఘనంగా తుంగభద్ర నది పుష్కరాలు, ప్రారంభమైన ఏర్పాట్లు

నదీనదాలకు పుష్కరాలనేవి ( Pushkaralu ) అనాది వస్తున్న సాంప్రదాయం. గురుడు ఒక్కోరాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలనేవి వస్తుంటాయి. ఇప్పుడు తుంగభద్ర నది పుష్కరాల ( Tunga Bhadra river pushkarams ) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇలా ప్రతి నదికి ఓ చట్రం ప్రకారం పన్నెండు సంవత్సరాలకోసారి పుష్కరాలు సంభవిస్తుంటాయి. ఇవి పన్నెండు రోజులపాటు ఉంటాయి. ఇప్పుడు తుంగభద్ర నదీ పుష్కరాలు సమీపిస్తున్నాయి. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకూ తుంగభద్ర నది పుష్కరాలు నడుస్తాయి.

గంగానది ( Ganga River ) లో స్నానం చేస్తే ఎంతటి పుణ్యమొస్తుందో...తుంగభద్ర నది ( Tunga Bhadra River ) నీళ్లు తాగితే అంతే పుణ్యం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే కోవిడ్ 19 వైరస్ సంక్రమణ ఉన్నాసరే..అత్యంత ప్రాశస్త్యమున్నవి కావడంతో తుంగభద్ర నది పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తుంగభద్ర పుష్కర ఏర్పాట్ల కోసం 199.91 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం పుష్కర పనుల్ని నవంబర్ 16లోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. 2008లో తుంగభద్ర పుష్కరాల్ని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar reddy ) నిర్వహించగా..ఇప్పుడు పన్నెండేళ్ల తరువాత అతని తనయుడు జగన్ నిర్వహించనుండటం విశేషం.

తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో 20 చోట్ల పుష్కర్ ఘాట్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం నదిలో వరద ప్రవాహం కొనసాగుతున్నందున వరద తగ్గిన వెంటనే పనుల్ని ప్రారంభించనున్నారు. పుష్కర ఘాట్లు, నదీ తీరప్రాంతంలో అత్యంత ప్రాశస్త్యమున్న పురాతన ఆలయాలకు వెళ్లే రహదారులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, అవసరమైతే కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది.  ఈ పనుల కోసం 147 కోట్లు మంజూరయ్యాయి. ఇక కర్నూలు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు పట్టణాల్లో ఇంటర్నల్ రోడ్లు, పారిశుద్యం కోసం 30 కోట్లు కేటాయించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఆదేశాల మేరకు పుష్కర ఏర్పాట్లపై మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, రాజేంద్రనాధ్ , వెల్లంపల్లి శ్రీనివాస్, జయరాంలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 21 శాఖల అధికార్లతో పుష్కరాల ఏర్పాట్ల కమిటీను ఏర్పాటు చేశారు. Also read: AP: వరద సహాయంపై కేంద్ర మంత్రి అమిత్ షాకు వైఎస్ జగన్ లేఖ

Trending News