Asani Cyclone Latest Update: అసనీ తుపాను ఆంధ్ర, ఒడిశా తీరానికి మరింత చేరువవుతోంది. రాత్రికి ఉత్తరాంధ్ర తీరానికి చేరుకుని..రానున్న 24 గంటల్లో బలహీనపడనుంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి
బంగాళాఖాతంలో ఏర్పడిన అసనీ తుపాను తీవ్ర తుపానుగా మారింది. గంటకు 10-12 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తూ ఏపీ, ఒడిశా తీరానికి చేరువవుతోంది. ఇవాళ అంటే మే 10వ తేదీ రాత్రి 9 గంటల వరకూ ఉత్తరాంధ్ర తీరానికి చేరనుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కాకినాడకు ఆగ్నేయంగా 260 కిలోమీటర్లు, విశాఖపట్నంకు దక్షిణంగా 3 వందల కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 490 కిలోమీటర్లు, పూరీకు నైరుతి దిశలో 570 కిలోమీటర్ల దూరంలో అసనీ తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడి నుంచి ఇవాళ రాత్రికి ఉత్తరాంధ్రకు చేరి..ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతం వైపుకు ప్రయాణించనుంది. రానున్న 24 గంటల్లో క్రమంగా బలహీనపడి తుపానుగా మారనుంది.
భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ
అసనీ తుపాను కారణంగా రానున్న మూడ్రోజుల పాటు ఉత్తర కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రేపు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పెనుగాలులు తీర ప్రాంతాల్లో గంటకు 75 కిలోమీటర్ల వరకూ వీయనున్నాయి. ఇక దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా పడనున్నాయి. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. తీర ప్రాంతాల్లో అయితే గంటకు 75 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయవచ్చు.
ఇక తెలంగాణలో కూడా అసనీ తుపాను ప్రభావంతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. రానున్న మూడ్రోజుల వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Asani Cyclone Latest Update: ఇవాళ రాత్రి ఉత్తరాంధ్రను తాకనున్న అసనీ తుపాను
ఏపీ తీరానికి మరింత చేరువలో అసనీ తీవ్ర తుపాను
కాకినాడకు ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలో అసనీ తుపాను కేంద్రీకృతం
ఇవాళ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఉత్తరాంధ్రను తాకనున్న అసనీ తుపాను