ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీటూర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు ఘాటగా స్పందించారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ఏదో చేస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారని.. వాస్తవానికి ఆయనకు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తే శక్తి లేదన్నారు.చంద్రబాబు కలసిన వారిలో అధికారం కోల్పోయిన రిటైర్డ్ పొలిటియన్స్ తప్పితే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే వారు ఒక్కరూ లేరన్నారు. రాహుత్ భేటీ ని ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నపిల్లల దగ్గరకు వెళ్లి చంద్రబాబు రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజలను దృష్టి మళ్లించే నాటకం
ఇది రాష్ట్రంలో సొంత పార్టీని కాపాడుకోలేని చంద్రబాబు.. దేశానికి ఏదో చేస్తారనుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇందతా రాష్ట్ర ప్రజలను దృష్టి మళ్లించే ఎత్తగడమే జీవిఎస్ వ్యాఖ్యానించారు. టీపీపీ సమర్ధత లేదని విషయాన్ని ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయిందని.. ఆ పార్టీని ఓడించేందుకు జనాలు డిసైడ్ అయ్యారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడిన ఆయనకు అధికారం దక్కడం కలేనని జీవీఎల్ ఎద్దేవ చేశారు.
చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా గురవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలు ప్రాంతీయ పార్టీల నేతలను కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీని వ్యతిరేకించే శక్తులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యమని.. దీని కోసం అన్ని పార్టీలను కలుపుకొని ఉమ్మడి ప్రణాళి సిద్ధం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు.. ఇది సరికొత్త ప్రభంజనంమని చంద్రబాబను కొనియాడుతుంటే.. బీజేపీ, వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత జీవీఎల్ ఈ మేరకు చంద్రబాబుపై ఈ మేరకు విమర్శలు సంధించారు.