BSNL offers: ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లు; పొడిగించిన గడువు

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Last Updated : Jan 2, 2019, 02:01 PM IST
BSNL offers: ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లు; పొడిగించిన గడువు

రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా, వోడఫోన్ ... ఇలా టెలీకాం రంగంలో అనేక ప్రైవేట్ కంపెనీల రంగ ప్రవేశంతో ప్రభుత్వం టెలీకాం సంస్థ  BSNL సర్వీసు వినియోగం రోజు రోజు తగ్గుతూ వస్తోంది. ప్రవైటు కంపెనీల ఆఫర్ల పంట పండిస్తుండటంతో అటువైపే కష్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు సంస్థలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ సంస్థ సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలె  కొన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించింది.

ప్రత్యేక ఆఫర్లు ఇవే..

ఎస్‌టీవీ 141 ప్లాన్‌తో 141 రూపాయలతో 28 రోజులపాటు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు ఫ్రీ కాల్స్‌, 10జీబీ హైస్పీడ్‌ డేటా, రోజుకు 50 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. అలాగే  రూ.49 రూపాయల ప్రతిభప్లస్‌ ప్లాన్‌తో 10 రోజుల పాటు దేశం మొత్తం అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత ఫ్రీ కాలింగ్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు 200 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 1జీబీ డేటా ఉచితంగా పొందవచ్చు.

మరిన్ని ఆఫర్లు మీకోసం

ప్రస్తుతం ఉన్న ఈ ఆఫర్ల గడువు ముగియడంతో మళ్లీ దీన్ని పొడిగించారు. ఈ సందర్భంగా జనరల్‌ మేనేజర్‌ కెఎస్‌ వరప్రసాద్‌ మీడియాకు తెలిపారు. ఇతర ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు సమీప కస్టమర్‌ సర్వీస్‌సెంటర్‌లో తెలుసుకోవచ్చుని పేర్కొన్నారు.

Trending News