YS Jagan's bail cancellation : ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దుకు నిరాకరించిన సీబీఐ కోర్టు.. Raghurama Krishnam Raju పిటిషన్‌ కొట్టివేత

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై చాలా ఉత్కంఠ కొనసాగింది. అయితే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, (YS Jagan Mohan Reddy) ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2021, 06:22 PM IST
  • జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ
  • రెండు మూడు నెలలుగా సుదీర్ఘ విచారణ
  • ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని జగన్‌ తరఫు న్యాయవాదుల వాదన
YS Jagan's bail cancellation : ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దుకు నిరాకరించిన సీబీఐ కోర్టు.. Raghurama Krishnam Raju పిటిషన్‌ కొట్టివేత

CBI Court Rejects Petition Seeking CM Jagan's Bail Cancellation:అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై చాలా ఉత్కంఠ కొనసాగింది. అయితే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, (YS Jagan Mohan Reddy) ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. 

జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ వేసిన పిటిషన్‌లపై జులై 30న వాదనలు ముగించిన సీబీఐ కోర్టు.. గత నెల 24నే తీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. అయితే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ (bail cancellation petition)పై వాదనలు ముగిసిన తర్వాత.. విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లలోనూ వాదనలు దాదాపు ఒకే తీరుగా జరిగాయి. గత నెల 24న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలు విన్న సీబీఐ కోర్టు (CBI Court).. రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెల్లడిస్తామంటూ తీర్పును ఈరోజుకి వాయిదా వేసింది.

Also Read : Cancer Treatment: కేన్సర్ చికిత్సలో గొప్ప ఆవిష్కరణ, లక్షణాలు లేకుండానే గుర్తింపు

సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు

ఈ కేసుపై సీబీఐ న్యాయస్థానంలో గత రెండు మూడు నెలలుగా సుదీర్ఘ విచారణ సాగింది. బెయిల్‌ మంజూరు చేసిన సందర్భంలో సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్, విజయసాయిరెడ్డి ఉల్లంఘించారని, వారి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnam Raju) తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే జగన్, విజయసాయిరెడ్డి ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని.. కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారంటూ జగన్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామరాజు పిటిషన్‌ను కొట్టేసింది. అయితే సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.

Also Read : Ola electric scooter sale: ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అమ్మ‌కాలు ప్రారంభం.. రూ. 499తో స్కూట‌ర్‌ని రిజర్వ్ చేసుకునే అవకాశం, సబ్సిడీ వల్ల ధరలో భారీ వ్యత్యాసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News