విజయవాడ- అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణం జాప్యానికి కారణం ఇదే !!

విజయవాడ-అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ బదులిచ్చారు

Last Updated : Jun 26, 2019, 01:08 PM IST
విజయవాడ- అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణం జాప్యానికి కారణం ఇదే !!

విజయవాడ- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జాప్యానికి కారణాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సభలో వివరణ ఇచ్చారు. భూసేకరణలో ఎదురౌతున్న ఇబ్బందులే  నిర్మాణానికి ఆటకంగా మారిందన్నారు. తర్వలోనే ఈ సమస్యను అధిగమించి దీని నిర్మాణ పనులు చేపడతామన్నారు.  రాజ్యసభలో వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి వేసిన ప్రశ్నకు మంత్రి గడ్కరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ-  అమరావతి రింగ్ రోడ్డుతో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇతర రోడ్ల నిర్మాణం గురించి విజయసాయిరెడ్డి  ప్రశ్నించారు.

ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ ఇదే..
రాజధాని అమరావతి భవిష్యత్తు అవసరాల కోసం కృష్ణ -గుంటూరు జిల్లాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సింగపూర్ అందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం మొత్తం 189 కి.మీ పొడవునా రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం ఆరు లేన్ల నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. ఇందు కోసం రూ 18 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కృష్ణాలోని 49 గుంటూరులోని 38 గ్రామాల మీదుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు చేపట్టనున్నారు. దీని నిర్మాణం కోసం కనీసం 3 వేల 400 హెక్టార్ల భూమి అవసరమౌతుందని అంచనా వేశారు. ఇంత పెద్దమొత్తంలో భూమి సేకరించాలంటే ఇక్కడ కూడా భూసేకణ సమస్య ఎదురౌతోంది. ఈ నేపథ్యంలో గడ్కరీ ఈ మేరకు వివరణ ఇచ్చారు.

Trending News