AP Voters Final List 2024: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన ఎన్నికల సంఘం వివిధ మార్పుల అనంతరం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్రతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి తుది జాబితాను విడుదల చేశారు ఏపీ ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఇవాళ కాస్సేపటి క్రితం తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఎలక్షన్ కమీషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడమే కాకుండా జిల్లాల్లో అధికారికంగా విడుదల చేయాలంటూ ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌లో ఈ జాబితాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎపీ ఎన్నికల కమీషన్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అప్‌లోడ్ చేసింది. ఇక ఆయా జిల్లాల్లో కలెక్టర్లు మౌఖికంగా వీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.
దాదాపు ఆరు నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులతో ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరిగింది. కొత్త ఓటర్ల నమోదుతో పాటు నకిలీ ఓట్ల తొలగింపు ప్రక్రియ కూడా పూర్తయింది. జనవరి 12 వరకూ వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాల్ని పరిశీలించిన తరువాత ఎన్నికల కమీషన్ తుది జాబితాను వెలువరించింది. తాజాగా ఓటు హక్కు పొందినవాళ్లు, మార్పులు, చేర్పులు చేసుకున్నవారు జాబితాను పరిశీలించుకోవాలి.
రాష్ట్రంలో నకిలీ ఓట్ల నమోదు , అసలు ఓట్ల తొలగింపు భారీగా జరుగుతోందని, తెలంగాణ ఓటర్లు కూడా ఏపీలో ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నారని ఇలా వివిధ రకాల ఫిర్యాదులు అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షం నుంచి ఎన్నికల సంఘానికి అందాయి. ఈ ఫిర్యాదుల పరిశీలన తరువాత ఓటర్ల తుది జాబితా ఇవాళ విడుదలైంది. మరి ఎవరి ఫిర్యాదు ప్రకారం ఏం చర్యలు ఎంతవరకూ తీసుకున్నారనేది వివిధ నియోజకవర్గాల జాబితాలు పరిశీలిస్తే గానీ తెలియదు.
Also read: Ram mandir Darshan Timings: రామమందిరం దర్శనం వేళలు ఇవే, సేవా టికెట్లు ఇలా బుక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook