నేడు 'హోదా'పై అఖిలపక్ష సమావేశం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Last Updated : Mar 27, 2018, 02:10 PM IST
నేడు 'హోదా'పై అఖిలపక్ష సమావేశం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా డిమాండ్‌పై రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేయడానికి ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ ప్రాంగణంలో  ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సంఘాల సమావేశం జరగనుంది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తీవ్రస్థాయిలో పోరాటాలు జరుగుతున్న ఈ సమయంలో అఖిలపక్ష సంఘాల సమావేశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి ప్రత్యేక హోదాపై తీర్మానం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. టీడీపీ ఎంపీలు కూడా ఎంపీ పదవులకు రాజీనామాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

'ఆల్ పార్టీ మీటింగ్' విషయమై ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ఆహ్వానాలు అందాయి. అయితే ఈ సమావేశానికి ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ, జనసేన దూరంగా ఉంటున్నాయి. సమావేశానికి హాజరుకాకపోవడానికి కారణాలు వివరిస్తూ వైసీపీ లేఖ రాసింది. ఇదిలా ఉంటే.. అఖిల పక్ష సమావేశంతో ఉపయోగం ఉండదనే భావనతో జనసేన దూరంగా ఉంటోంది.

Trending News