Supreme Court: స్కిల్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న క్వాష్ పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఏం చేయనుందనేది ఆసక్తిగా మారింది.
చంద్రబాబు కేసులో ఇవాళ అత్యంత కీలకం కావచ్చు. స్కిల్ కేసులో తన అరెస్ట్ , రిమాండ్ అక్రమమంటూ తొలుత దాఖలు చేసిన పిటీషన్‌ను ఏసీబీ కోర్టు సుదీర్ఘ వాదనల అనంతరం కొట్టివేసింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్ధ్ లూధ్రా వాదనలు విన్పించగా, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. అనంతరం ఏపీ హైకోర్టు క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వాస్తవానికి గత వారమే సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ముంచు విచారణ జరగాల్సి ఉన్నా..జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ మి ప్రస్తావన తేవడంతో కసు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్‌కు బదిలీ అయి ఇవాళ్టికి వాయిదా పడింది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందనేది చంద్రబాబు తరపున న్యాయవాదుల వాదనగా ఉంది. మరోవైపు ఈ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని సీఐడీ కోరింది. ఇవాళ విచారణ సందర్భంగా ఏం జరుగుతుందనేది అత్యంత ఆసక్తి కల్గిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook