Chandrababu: తమిళ తెలుగు ప్రజల కోసం చంద్రబాబు మరో డేరింగ్ స్టెప్..

Chandrababu: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడుకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. కూటమి నేతృత్వంలో అపూర్వ విజయం సాధించిన బాబు ప్రస్తుతం అనేక సవాళ్లు ఉన్నాయి. తాజాగా తమిళనాడులో తెలుగు ప్రజల కోసం ఓ డేరింగ్ స్టెప్  తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 4, 2024, 12:59 PM IST
Chandrababu: తమిళ తెలుగు ప్రజల కోసం చంద్రబాబు మరో డేరింగ్ స్టెప్..

Chandrababu: ప్రస్తుతం ప్రపంచలో ఏ మూలకు వెళ్లినా తెలుగు ప్రజలు కనిస్తుంటారు. ఆదిలాబాద్ టూ అమెరికా వయా అనకాపల్లి అనేలా  వరల్డ్ వైడ్ గా తెలుగు ప్రజలు తమ ఉనికి చాటుకుంటున్నారు. అటు ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు మాట్లాడే ప్రజలు విరివిగా ఉన్నారు. మహారాష్ట్రతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా తెలుగు ప్రజలు ఎంతో కాలంగా అక్కడ స్థానికంగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో తెలుగు మీడియంలో చదువుకునే విద్యార్థులు ఆ రాష్ట్ర ప్రభుత్వo నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో అపుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించారు. ఈ విషయాన్ని తమిళనాడులో తెలుగు వాళ్ల హక్కుల గురించి పోరాడుతున్న కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గుర్తు చేసారు. తాజాగా ఈయన ఏపీలో చంద్రబాబు నివాసంలో కలిసి తమిళనాట తెలుగు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం అందజేసారు. దీనిపై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.

ఈ  సందర్భంగా కేతి రెడ్డి ప్రస్తావించిన అంశాల విషయానికొస్తే..

బోధనామాద్యమం విషయంలో  "బోధించే ఉపాధ్యాయుడికి నేర్చుకునే విద్యార్థికి ఇరువురికి సులువుగా బాగా అర్థమయ్యే భాషలోనే బోధన జరపడం ఉత్తమం’ అని  ప్రపంచ బ్యాంకు మనలాంటి దేశాలకు ఒక ముఖ్యమైన సూచన చేసింది.
అదే సమయంలో జాతీయ విద్యా విధానం 2020 రూపొందించిన పత్రంలో ఐదవ తరగతి వరకు తప్పని సరిగాను కనీసంగా ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులకు వారి మాతృభాషలోనే బోధన చేయాలని అందులోఉంది.
 
ఇటీవల విజయవాడలో మీరు
అత్యంత ఘనంగా చెరుకూరి రామోజీరావు గారి సంస్మరణ సభను నిర్వహించారు. వారు
నడిపిన తెలుగు వెలుగు పత్రిక ద్వారా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని పదే పదే
సూచన చేశారని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను .
పై విషయాలన్నింటి దృష్ట్యా
ఈ క్రింది అంశాలను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచాలని
పొరుగు రాష్ట్రంలో జీవించే సాటి తెలుగు వానిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తన వినతి పత్రంలో పేర్కొన్నారు. .

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే  ఇంటర్మీడియట్ చదువుల వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు బడులలో తెలుగు మాధ్యమం చదువులను బోధించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రంలో కూడా అలాంటి దుస్థితి ఏనాడు రాకూడదని మా ప్రగాఢ కోరిక. దానికి తొలి చర్యగా ప్రాథమిక పూర్వ విద్య నుండి ఇంగ్లీషు మీడియంలో చదువులు చెప్పాలనే గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.  

ప్రస్తుత పరిస్థితులలో ఇంగ్లీషుతో పాటు 8వ తరగతి వరకు తెలుగు భోదన తప్పని సరి చేయాలన్నారు.

భౌగోళిక పరిస్థితుల రీత్యా తెలుగు భాషతో పాటు  ఇంగ్లీష్ బోధించాలని చెప్పారు.

పాలనారంగం:

1. రాష్ట్రంలో ఉండే అన్ని కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలోనూ , అన్ని స్థాయిలలోనూ తెలుగే వాడాలే చూడాలన్నారు.  ఇతర రాష్ట్రాలతో, దేశాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లీషులో ఉండవచ్చు.

2. న్యాయస్థానాలలో ప్రజలభాషే వాడాలన్నారు. వాదోపవాదాలకు, తీర్పులకు ప్రజలభాషే వాడాలని కోరారు. 

3. చట్టాలు శాసనాలు, ముఖ్యమైన తీర్పులు, ప్రభుత్వ ఆదేశాలు ప్రజల భాషలో ఉండాలన్నారు.

4. వ్యాపారులు తమ తమ షాపులకు  తెలుగు దనం గుబాళించే పేర్లు పెట్టుకోవాలని సూచించారు.
దీనిపై ఎప్పటినుండో  ప్రభుత్వ ఆదేశాలు ఉండినా దురదృష్టవశాత్తు అమలుకు నోచుకోవడం లేదన్నారు.

5. మాతో సహా  ఇతర రాష్ట్రాలలో జీవిస్తున్న తెలుగువారి పిల్లల విద్యాభ్యాసం కోసం జనాభా  ప్రకారం పాఠశాలలు ఏర్పాటు చేసేట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

6. మన రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు ఇతర రాష్ట్రాలలో తెలుగువారి కొరకు ఉపాధ్యాయులను, పాఠ్యగ్రంథాలను, సాహిత్యాన్ని అందించేట్లుగా వారికి సహకారం అందించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలి.

7.విద్యాప్రవేటీకరణకు, ఇంగ్లీషు మాధ్యమం చదువులకు, ఇప్పటివరకు  విభజించటానికి వీలులేనిదన్నట్లుగా సాగుతున్న లంకెను తక్షణమే విడదీయాలి.
ప్రైవేటు స్కూల్లు కూడా
తెలుగు మీడియంలోనే  బోధన సాగించాలని ఆదేశించాలి. ఈ నిబంధనను పాటించని ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు రద్దు చేయాలన్నారు.  

చివరగా...
జాతి సంస్కృతికి ప్రాణాధారం  అయిన భాష నిరాదరణకు గురైతే సంస్కృతి కూడా సంక్షోభంలో పడుతుంది. అందుకే ఏపీతో పాటు తమిళనాడులో తెలుగు భాష అభివృద్ది కోసం కృషి చేయాలన్నారు.

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News