జాతీయ రాజకీయాల్లో  చంద్రబాబు Vs కేసీఆర్ ; పోరులో నిలిచేదెవరు..గెలిచేదెవరు ?

జాతీయ రాజకీయాల్లోకి సత్తా చాటేందుకు ఇద్దరు చంద్రులు మళ్ళీ పోటీ పడుతున్నారు. లక్ష్యసాధనలో చంద్రబాబు తన పరిచయాలను నమ్ముకుంటే..కేసీఆర్ మాత్రం పూర్తిగా తన వ్యూహాలపైనే ఆధారపడుతున్నారు

Last Updated : Dec 13, 2018, 08:53 PM IST
జాతీయ రాజకీయాల్లో  చంద్రబాబు Vs కేసీఆర్ ; పోరులో నిలిచేదెవరు..గెలిచేదెవరు ?

ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు.. వీరిద్దరిని కలిపి ఇద్దరు చంద్రులుగా పిలిచే ఛాన్స్ ఉన్నప్పటికీ.. వైఖరిలో మాత్రం ఇరువురు సూర్య చంద్రుల్లా వ్యవహరిస్తారు. ఈ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి. ఈ ప్రస్తావన మళ్లీ ఎందుకు వచ్చిందంటే .. వీరిద్దరు మళ్లీ తలపడబోతున్నారు..అయితే ఇప్పటిలాగా రాష్ట్రాల వేదికపై కాదు.. జాతీయ స్థాయి వేదికపై..ఎలగెలగెలగా ప్రాంతీయ పార్టీల అధినేతలకు జాతీయ రాజకీయాలేంటి అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది కదూ.. అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది

పరిచయాలనే నమ్ముకున్న బాబు

ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు చురుగ్గా పాల్గొంటున్నారు..బీజేపీ వ్యతిరేకంగా సేవ్ నేషన్ సేవ్ డెమెక్రసీ నినాదంతో దూసుకెళ్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ తో జతకట్టిన చంద్రబాబు.. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపై తీసుకున్న ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీయేతర కూటమి ఆవశ్యకత గురించి దేశ వ్యాప్తంగా తిరిగి చెబుతున్నారు. ఈ క్రమంలో వివిధ జాతీయ,ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో సమావేశం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీని వ్యతిరేకించే దాదాపు 20 పార్టీలు ఏకతాటిపై వచ్చాయి. దీంతో చంద్రబాబుకు విశేష్ క్రెడిట్ వచ్చింది. ఎందుకంటే ఒకనోక దశలో ఇది కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకీ సాధ్యపడలేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ముక్త్ భారత్ నినాదం తీసుకొచ్చినప్పటికీ ప్రాంతీయ పార్టీలు మిశ్రమంగా స్పందించాయి. అయితే రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు.. తన పాత మిత్రులను కలిసి ఈ విషయంలో అందర్ని కన్విన్స్ చేయగలిగారనే వాదన ఉంది. ఇలా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు

వ్యూహాలా పైనే ఆధారపడ్డ కేసీఆర్

ఇక కేసీఆర్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందే దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యక ఉందని నొక్కిచెప్పారు. అప్పట్లో కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, మాయవతి ఇలా అనేక మందిని సీఎం కేసీఆర్ కులుసుకున్నారు. అయితే ముందుస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో కేసీఆర్ ఆ ప్రయత్నానికి కాస్త విరామం ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి... టీఆర్ఎస్ మళ్లీ ఘన విజయం సాధించింది. దీంతో మళ్లీ కేసీఆర్ నోట జాతీయ రాజకీయాల మాట వినిపించింది. రిజర్వేషన్ల పెంపు, రైతు సమస్యలు, ఆర్ధి వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ ..దేశంలో విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉందన్నారు. ఇందుకు బీజేపీ - కాంగ్రెస్ యేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాల్సి ఉందని నొక్కిచెప్పారు. ఇందు కోసం దేశ వ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు. ఈ విషయంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తో కలిసి నడుస్తానని కేసీఆర్ పేర్కొనడం గమనార్హం. 

పోరులో నిలిచేదెవరు..గెలిచేదెవరు ?

ఇద్దరు చంద్రులు విశేష రాజకీయ అనుభవ కలవారే.. అనుకున్నది సాధించే వరకు పట్టువీడని విర్రమార్కులే.. సామరధ్యంలో ఎవరికి వారే సాటి... అయితే సూర్యచంద్రుల్లా వీరిద్దరి లక్ష్యం వేరు..అనుసరించే పంథా వేరు..ఒకరు బీజేయేతర కూటమిని కోరకుంటుంటే..మరోకరు బీజేపీ-కాంగ్రెస్ యేతర కూటమిని వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ రెండు ప్రయత్నాలు బీజేపీకి వ్యతికేంచే శక్తులను ఏకం చేయడమే అయినప్పటికీ .. చంద్రబాబు ఒక్క బీజేపీనే టార్గెట్ చేసుకుంటే.. కేసీఆర్ మాత్రం మరో అడుగు ముందుకు వేసి ఇందులో కాంగ్రెస్ ను చేర్చి బీజేపీ -కాంగ్రెస్ ఈ రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ఈ లక్ష చేధనలో చంద్రబాబు తన పాత పరిచయాలను నమ్ముకుంటే..కేసీఆర్ మాత్రం తన పదునైన వ్యహాలపైనే ఆధారపడుతున్నారు. ఇందులో ఎవరు గెలుస్తారు...అంతిమంగా ఎవరు విజేతగా నిలుస్తారు అనేది తేలాలంటే 2019 సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు వేచిచూడాల్సిందే...

Trending News