YSR Law Nestham: యువ లాయర్లకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.30 వేలు జమ

YSR Law Nestham Funds Released: యువ లాయర్లకు వైఎస్సార్ లా నేస్తం నిధులను సీఎం జగన్ నేడు విడుదల చేశారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేశారు. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.30 వేలు జమ చేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 11, 2023, 02:11 PM IST
YSR Law Nestham: యువ లాయర్లకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.30 వేలు జమ

YSR Law Nestham Funds Released: కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్లపాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్లకు మొత్తం రూ.1.80 లక్షలు జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఏడాదికి రెండుసార్లు నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామ‌న్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల స్టైఫండ్‌ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఆరు నెలలకు ఒక్కొ­క్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేశారు. ఇప్పటివరకు మొత్తం 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.49.51 కోట్ల ఆర్థికసాయం అందించింది జగన్ ప్రభుత్వం.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తితో యువ లాయ‌ర్లు పేద‌వారికి న్యాయం చేయాల‌ని సూచించారు. వరుసగా నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్ లా నేస్తం అనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నామన్నారు. లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము నిలబడేందుకు.. ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్లపాటు సంవత్సరానికి రూ.60 వేలు అంటే నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 80 వేలు ఇస్తున్నామన్నారు. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వారికి తోడుగా ఉంటున్నామని చెప్పారు.

"దాదాపు ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్ చెల్లెమ్మలు, తమ్ముళ్లకు దాదాపు 8 కోట్లు బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30 వేల చొప్పన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం.. అడ్వొకేట్లకు వాళ్ల ఇనీషియల్ స్టేజ్‌లో నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం మంచి చేస్తూ అడుగులు ముందుకేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ల ప్రొఫెషన్‌లో వాళ్లు నిలదొక్కుకోవడం.. తరువాత ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి మనం చేసే ఈ కార్యక్రమం మంచి ముందడుగు అవుతుంది." అని సీఎం జగన్ అన్నారు.

అడ్వొకేట్లందరూ బాగుండాలని వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో లా నేస్తం పథకమే కాకుండా.. రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించామన్నారు ముఖ్యమంత్రి. ఈ ట్రస్టు వల్ల కోవిడ్ సమయంలో ఎంతో మేలు జరిగిందన్నారు. 643 మందికి కోవిడ్ సమయంలో రూ.52 లక్షలు అందించినట్లు చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్‌ను ఆదుకుంటూ 7,733 మందికి రూ.11.56 కోట్లు రుణాలు అందజేసినట్లు సీఎం జగన్ తెలిపారు.

Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News