CM Jagan: సీఎం జగన్ బర్త్ డే స్పెషల్.. విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్

CM Jagan Mohan Reddy Birthday Special:  సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నుంచి ప్రతి యేటా అందజేస్తామని ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 02:16 PM IST
  • ఏపీలో విద్యా విప్లవం మొదలు
  • 5,18,740 ట్యాబ్‌ల పంపిణీ ప్రారంభించినన సీఎం జగన్
  • ఇక నుంచి ప్రతి యేటా పంపిణీ
CM Jagan: సీఎం జగన్ బర్త్ డే స్పెషల్.. విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్

CM Jagan Mohan Reddy Birthday Special: ఏపీలో విద్యా విప్లవం మొదలైందని సీఎం జగన్ అన్నారు. చదువులు అంటే ప్రభుత్వానికి ఖర్చు కాదని.. అదో గురుతర బాధ్యతన్నారు. ప్రతి చిన్నారి కుటుంబానికి పిల్లలను చదివే ఆర్థిక అండ కల్పిస్తూ నాణ్యమైన చదువులు అందించే పాఠశాలను అభివృద్ధి చేయడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఇది భావితరాల ఉజ్వల భవితకు బాటలుగా భావిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో రాష్ర్ట వ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు, 59,176 టీచర్లకు మొత్తంగా 5,18,740 ట్యాబ్‌ల పంపిణీని సీఎం జగన్ బుధవారం ప్రారంభించారు. బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో అందించనున్న ఈ ట్యాబ్‌ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.1,466 కోట్ల ఖర్చు చేసినట్లు స్థానిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి తెలిపారు. 2019 నుంచి పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణల హోస్ట్‌లో భాగంగా టాబ్లెట్‌లను పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు స్థూల నమోదు నిష్పత్తి పెంచడానికి, అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం తోడ్పడుతోందన్నారు సీఎం జగన్. ఈ పథకం ద్వారా 45 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరగా అమ్మఒడి పథకం కోసం రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.19,617.6 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

'నా పుట్టిన రోజు నాడు నాకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తుకోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పలు పంచుకోవడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మన పిల్లలు అంటే.. మన తర్వాత కూడా ఉండే మనం. పిల్లలు బాగుండాలని తమకన్నా కూడా బాగా ఎదగాలని, తమకన్నా మంచిపేరు ఇంకా తెచ్చుకోవాలని, ప్రతి తల్లీదండ్రీ కూడా మనసారా  కోరుకుంటారు. ప్రతి బడిలోనూ ఒక డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టాం. పలకల చదువులతోనే కొన్ని తరాల విద్యాభ్యాసం ముగిసిపోయింది. వచ్చే తరం పిల్లల మీద కూడా మంచి మేనమామగా బాధ్యత తీసుకున్నాను. రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబులను పంపిణీ చేస్తున్నాం..

వీళ్లంతా 10వ తరగతి పరీక్షలు రాసే సమయానికి సుశిక్షితులు చేసేందుకు ఈ ట్యాబులు అందజేస్తున్నాం. వీరికి చదువులు చెబుతున్న టీచర్లకూ ట్యాబులు ఇస్తున్నాం. 26 జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉన్నవారందరికీ ఇస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ఇక మీదట 8వ తరగతిలోకి వచ్చే ప్రతి విద్యార్థికీ ట్యాబులు ఇస్తాం. ఒక్కసారి నా పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్నది కాదు. 8వ తరగతిలో వచ్చే ప్రతి పిల్లాడికీ ఇస్తాం. ట్యాబుల్లో ఇంగ్లిషులోనూ, తెలుగులోనూ సబ్జెక్టులు ఉంటాయి. బాగా అర్థం కావడానికి అన్ని భాషల్లో పాఠాలు ఉంటాయి. ట్యాబులు కారణంగా ఎంతో మేలు జరుగుతుంది..' అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

ఇంటర్నెట్‌ లేకపోయినా ఆఫ్‌లైన్‌లో కూడా ఈ ట్యాబులు ద్వారా పాఠాలు వినే అవకాశం ఉంటుందన్నారు సీఎం జగన్. ట్యాబులుకు మూడు సంవత్సరాల వ్యారెంటీ ఉంటుందన్నారు. మనం ఇచ్చే టెక్నాలజీ వల్ల పిల్లలకు మంచి జరగాలి తప్ప చెడు జరక్కూడదన్నారు. ఇదే ఆలోచనతో ఎండీఎం సాఫ్ట్‌వేర్‌ పెట్టారని చెప్పారు. ట్యాబుల్లో పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారని అన్నారు. పిల్లలకు నష్టం కలిగించే కంటెంట్‌ను మీ మేనమామ కత్తిరిస్తున్నాడంటూ నవ్వులు పూయించారు. పిల్లలు, ఏంచూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు, టీచర్లకు ఈ సాఫ్ట్‌వేర్‌ద్వారా తెలుస్తుందన్నారు.  

ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకూ ప్రతి క్లాసులోనూ డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి పై తరగతి వరకూ ప్రతి సెక్షన్‌లోనూ డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ కాబోతున్నాయన్నారు. నాడు –నేడు కింద మొదటిదశలో పనులు పూర్తిచేసుకున్న తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు పెట్టి డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌గా మార్బబోతున్నామన్నారు. వచ్చే జూన్‌కల్లా.. వీటి ఏర్పాటు పూర్తవుతుందన్నారు.

Also Read: Vishal Laththi Movie : 'లాఠీ' లూటీ అయ్యేలానే ఉంది.. విశాల్‌పై పవర్ స్టార్ ఫ్యాన్స్‌ ఫైర్

Also Read: Sushmita Konidela Daughter : చిరు 'బాస్ పార్టీ' సాంగ్.. తాత పాటకు మనవరాలు స్టెప్పులు.. సుష్మిత కూతురు రచ్చ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News