ఏపీలో 25 వేలు దాటిన కరోనా కేసులు

AP CoronaVirus Cases | గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో గత 24 గంటల్లో ఏపీలో 15 కరోనా మరణాలు సంభవించాయి

Updated: Jul 10, 2020, 02:33 PM IST
ఏపీలో 25 వేలు దాటిన కరోనా కేసులు

AP Corona Cases | గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1576 మందికి కరోనా సోకగా, మిగతా 32 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 25,422కు చేరుకున్నాయి. ఆ అల్లుడు చాలా లక్కీ.. నెటిజన్ల రియాక్షన్ వైరల్
 

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 13,194 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 11,936 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 15 కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 292కి చేరింది.   కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య.. ఊహించని ట్విస్ట్

 

తాజాగా కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, అనంతపురంలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనా బారిన పడి మరణించారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 21,020 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 1,608 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 981 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

 

నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 11,15,635 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 22,647 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,351 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 424 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జులై 10న హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos