Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. 57 లక్షల మందికి గ్రామాల్లోనే ఉపాధి..!

Deputy CM Pawan Kalyan Review Meeting: గ్రామాల్లో 57 లక్షల మందికి పని కల్పించేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ తెలిపారు. రెండో తరం సంస్కరణలతో మలి దశ విప్లవం రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నామని చెప్పారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 22, 2024, 11:25 AM IST
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. 57 లక్షల మందికి గ్రామాల్లోనే ఉపాధి..!

Deputy CM Pawan Kalyan Review Meeting: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పరిపాలన పరంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాను నిర్వహిస్తున్న శాఖలపై పూర్తి అవగాహన తెచ్చుకున్న పవన్.. గ్రౌండ్ లెవల్ నుంచి మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రక్షాళన మొదలుపెట్టారు. తాజాగా 57 లక్షల మందికి గ్రామాల్లోనే ఉపాధి కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధివిధానాలపై ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా 13,326 పంచాయతీల్లో 87 పనులు పూర్తి చేసేలా 57 లక్షల మందికి పని కల్పించేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.

Also Read: Vishwambhara: మెగాస్టార్ బర్త్ డే ట్రీట్ అదిరిపోయిందిగా.. నో డౌట్ ‘విశ్వంభర’ తో చిరు హిట్ కొట్టేలా ఉన్నాడే..

"దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన రెండో రాష్ట్రం మనది. రెండో తరం సంస్కరణలతో మలి దశ విప్లవం ఏపీ నుంచి మొదలు పెడుతున్నాం.. స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవ వేడుకలకు వంద రూపాయలు 10 వేలు, 250 రూపాయలను 25 వేలకు పెంచి ఎన్డీఏ చిత్తశుద్దిని చూపాం. గ్రామ సభలు అంటే.. సమావేశాలు కాదు.. గ్రామాల అభివృద్దికి బాధ్యత తీసుకోవడం. గ్రామ సభల్లో అందరూ పాల్గొనండి.. దిగ్విజయం చేయండి. మోడీ, చంద్రబాబు సారథ్యంలో గ్రామాల అభివృద్ది చేసి చూపుతాం. గత ప్రభుత్వంలో 40 వేల 578 కోట్ల జాతీయ ఉపాధి పథకం పనులు చేశారు. కానీ ఆ ఫలితాలు ఎక్కడా కనిపించలేదు.. ఆ నిధులు సద్వినియోగం  చేయలేదు.

రూ.240 కోట్ల పై చిలుకు నిధులు పంచాయతీల నుంచి వచ్చేవి. 2019-23 కి 170 కోట్లు మాత్రం పంచాయతీల నుంచి ఆదాయం తగ్గించారు. వాటి కాళ్ల మీద అవి నిలబడేలా పంచాయతీల్లో ఆర్దికాభివృద్ది సాధిస్తాం. ప్రతి పంచాయతీకి ఒక యూనిక్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీల్లో అక్కడ ఉన్న ప్రత్యేకతలను గుర్తించి.. వాటికి మార్కెటింగ్ పెంచేలా గ్రామ సభల్లో చర్చ చేయాలి. రాష్ట్రంలో మార్పు కోసం ఓట్లు వేసేందుకు బాధ్యతతో ప్రజలు తరలి వచ్చారు. అదే విధంగా ఈ గ్రామ సభలకు కూడా తరలి వచ్చి.. మీ ఆలోచనలు పంచుకోండి

ముఖ్యంగా మహిళలు, యువత పాల్గొని.. సాధికారిత సాధించాలి. చాలా పంచాయతీల్లో భూములు ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయి. స్వచ్చ భారత్ వల్ల బహిరంగ మల విసర్జన తగ్గింది. అదే విధంగా ప్రతి గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. డెన్మార్క్ నుంచి 6 వేల కోట్ల విలువ చేసే కలపను మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఏపీతో పోలిస్తే.. పావు వంతు కూడా ఉండని దేశం డెన్మార్క్. ప్రతి పంచాయతీ పరిధిలో అవసరమైన కలపను పెంచేలా చర్యలు చేపట్టాలి. నరేగా ఫండ్స్‌ను కూడా 87 పనులకు అందిస్తున్నాం..

ఎకో టూరిజంకు దగ్గరగా ఉండే పంచాయతీలు, నేత పరిశ్రమలు ఉన్న పంచాయతీలను సందర్శించేలా చేస్తాం. కూటమి ప్రభుత్వంలో ఇన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ఆనందంగా ఉంది. పంచాయతీలకు వచ్చిన నిధులు వివరాలు సర్పంచ్‌లకు కూడా తెలియని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగినట్లు నా సమీక్షల్లో అర్దమైంది. సోషల్ ఆడిట్ చాలా బలహీనంగా జరిగింది.. పారదర్శకత లోపించింది. సోషల్ ఆడిట్ విభాగానికి పోలీసు ఆధికారిని నియమించే ఆలోచన చేస్తున్నాం.." అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News