Dissent leaders in Kammam: అనుచరుల మాట మాజీ మంత్రి తుమ్మల వింటాడా...?

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో కీలక నేతలుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నిజంగానే పార్టీ మారే అలోచనలో ఉన్నారా.. ఖమ్మం రాజకీయాలతో తెలంగాణలో రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయా.. ఖమ్మం టీఆర్ఎస్‌ అసమ్మతి నేతలు వచ్చే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారన్నది అంతు పట్టడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 01:49 PM IST
  • ఖమ్మం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణలు
  • అసమ్మతి నేతల వరుస భేటీలతో గులాబీ పార్టీలో గులుబు
  • జిల్లాలో జోరుగా తిరుగుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • తుమ్మల పోటీ చేసి తీరాలంటున్న అనుచరులు
  • తుమ్మలతో చర్చలు జరిపిన జూపల్లి కృష్ణారావు
Dissent leaders in Kammam: అనుచరుల మాట మాజీ మంత్రి తుమ్మల వింటాడా...?

Dissent leaders in kammam: ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో కీలక నేతలుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు గత కొంతకాలంగా పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తుమ్మల కొన్నిరోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. 

ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వరుస భేటీలతో టీఆర్ఎస్‌ అసమ్మతి నేతలు పార్టీ అధిష్టానికి గుబులు పుట్టిస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో జోరు పెంచుతున్నారు. గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న నేతలు ఒక్కసారిగా యాక్టివ్ గా మారడంతో ఏదో జరుగుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. వారు నిజంగానే పార్టీ మారే అలోచనలో ఉన్నారా.. ఖమ్మం రాజకీయాలతో తెలంగాణలో రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయా.. ఖమ్మం టీఆర్ఎస్‌ అసమ్మతి నేతలు వచ్చే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారన్నది అంతు పట్టడం లేదు.

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో కీలక నేతలుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు గత కొంతకాలంగా పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తుమ్మల కొన్నిరోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి తుమ్మలకు సంబంధించిన నేతలకు పార్టీ పదవులు, నామినేట్ పదవుల్లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన తుమ్మల అనుచరులపై కక్షకట్టి అక్రమ కేసులు కూడా నమోదు చేయించినట్లు కందాలపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై పోలీసుల తీరును కూడా తుమ్మల తప్పుబట్టారు. తుమ్మల, ఎమ్మెల్యే కందాల ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పటి వరకు ఈ ఇద్దరు ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పార్టీలో ఇంత జరుగుతున్నా అధిష్టానం పట్టనట్లు వ్యవహరించడం పట్ల తుమ్మల అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న తుమ్మల మళ్లీ నియోజకవర్గంలో యాక్టివ్‌గా పర్యటన చేస్తుండడంతో జిల్లాలో కొత్త రాజకీయాలు మొదలయ్యాయి. మళ్లీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం లేకున్నా.. స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలవాలని కార్యకర్తలు తుమ్మలను కోరుతున్నారని సమాచారం. మరో పక్క జిల్లా పర్యటనలో తుమ్మల కీలక వాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే తుమ్మల పార్టీ మారే ఆవకాశాలు లేదని తెలుస్తోంది. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుండైనా పోటీ చేస్తానని, పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదన్నారు తుమ్మల. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు అసమ్మతి నేతలను కలిసి వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపాథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ బలపడేందుకు ఈ నేతలకు గాలం వేస్తున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం నడుస్తోంది.  

Also Read: Inter Exams 2022: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు.. ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసుకోండి!

Also Read: Video: డ్రాగన్ స్నేక్... ఒళ్లంతా నాచు... నెట్టింట వైరల్ అవుతోన్న వింత పాము..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News