Mlc Elections: ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Mlc Elections: ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఎన్నికల హడావిడి నడుస్తోంది.  పంచాయితీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలు కానుంది.  

Last Updated : Feb 18, 2021, 02:48 PM IST
  • ఏపీలో మోగిన మరో ఎన్నికల నగారా, మార్చ్ 15న ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
  • ఫిబ్రవరి 25 నుంచి నామినేషన్లు ప్రారంభం, మార్చ్ 8వ ఉపసంహరణ
Mlc Elections: ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Mlc Elections: ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఎన్నికల హడావిడి నడుస్తోంది.  పంచాయితీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలు కానుంది.

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు (Panchayat Elections)త్వరలో పూర్తి కానున్నాయి. ఇప్పటికే మూడు దశల పోలింగ్ ముగిసింది. మరో విడత ఎన్నికలు మిగిలాయి. మరోవైపు ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ( Municipal elections )నగారా మోగింది. మార్చ్ 2 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమై..మార్చ్ 14న జరిగే కౌంటింగ్‌తో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 75 నగర పంచాయితీలు, మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ( Mlc Elections Notification )ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం  ( Election commission of india )షెడ్యూల్ విడుదల చేసింది. మార్చ్ 15న ఎన్నికలు జరగనున్నాయి.ఫిబ్రవరి 25వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చ్ 4 వరకూ నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. మార్చ్ 5న నామినేషన్ల పరిశీలన కాగా..మార్చ్ 8న ఉపసంహరణకు గడువు ఉంటుంది. మార్చ్ 15వ తేదీ ఉదయం 9 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు 5 గంటలకు కౌంటింగ్ జరగనుంది. 

మార్చ్ 29వ తేదీతో నలుగురు ఎమ్మెల్సీల పదవీకారం ముగియనుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా, చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం ముగుస్తున్నవాటిలో తిప్పేస్వామి, సంధ్యారాణి, వీరవెంకట చౌదరి, షేక్ అహ్మద్ ఇక్బాల్ ఉన్నాయి. ఇవి కాకుండా మరో రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఏపీలో మార్చ్ నెలలోనే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి మార్చ్ వరకూ ఎన్నికల సందడి నెలకొననుంది.

Also read: Ap High Court: మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ ఆదేశాల్ని కొట్టివేసిన హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News