Eluru Corporation Results: ఎన్నికల్లో భారీ విజయం, కోవిడ్‌తో మరణం

Eluru Corporation Results: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారపార్టీ భారీ విజయం సాధించింది. ఓ ఇద్దరు అభ్యర్ధులకు మాత్రం దురదృష్టం అసాధారణంగా వెంటాడింది. జనం నమ్మకం పెట్టినా..దేవుడు కాదన్నాడు. గెలిచినా మృత్యువు వెంటాడేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2021, 09:56 AM IST
 Eluru Corporation Results: ఎన్నికల్లో భారీ విజయం, కోవిడ్‌తో మరణం

Eluru Corporation Results: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారపార్టీ భారీ విజయం సాధించింది. ఓ ఇద్దరు అభ్యర్ధులకు మాత్రం దురదృష్టం అసాధారణంగా వెంటాడింది. జనం నమ్మకం పెట్టినా..దేవుడు కాదన్నాడు. గెలిచినా మృత్యువు వెంటాడేసింది.

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు (Eluru Corporation Results)వెలువడ్డాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం కైవసం చేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్ధులకు దురదృష్టం వెంటాడింది. ఎన్నికల్లో గెలుపు కోసం డివిజన్ అంతా కలియ తిరిగారు. జనం కూడా ఆ ఇద్దరిపై నమ్మకముంచి..ఓట్లేశారు.ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులే. జనం గెలిపించినా..కోవిడ్ మాత్రం దారుణంగా కాటేసింది. ఫలితాలు వెల్లడి కాకుండానే కోవిడ్ కారణంగా మృత్యువాత పడ్డారు. 

ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్ వైసీపీ అభ్యర్ధి బేతపూడి ప్రతాపచంద్ర ముఖర్జీ 1058 ఓట్ల తేడాతోనూ, 46వ డివిజన్ వైసీపీ అభ్యర్ధి ప్యారీ బేగం 1232 ఓట్ల తేడాతోనూ గెలిచారు. ఇరుగు పొరుగు డివిజన్ల అభ్యర్ధులిద్దరూ విజయం సాధించారనే విషయం తెలియకుండానే కోవిడ్ కారణంగా మరణించడం చాలా దురదృష్టకరం. మొత్తం 50 డివిజన్లలో 47 డివిజన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr congress party) గెల్చుకుంది. తెలుగుదేశం పార్టీ 3 స్థానాలకు పరిమితమైంది.

Also read: Eluru Result: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News