Navaratnalu: కరోనా సంక్షోభ సమయంలో సామాన్యులు, పేదల పరిస్థితి దయనీయంగా మారింది. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరించి విదానాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నవరత్నాలు పథకం కరోనా కష్టకాలంలో ఆదుకుందంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) సంక్షేమ పథకాల్ని ఎక్కడా ఆపకుండా అమలు చేశారు. ముఖ్యంగా నవరత్నాలు పథకం గణనీయమైన ప్రభావం చూపించింది. కరోనా కష్టకాలంలో పేదలందరికీ ఈ పథకం చాలా ఆదుకుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavilli Arun kumar) తెలిపారు. కరోనా సంక్షోభంలో కూడా పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ ఆదుకున్నారంటూ వైఎస్ జగన్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ఈ తరహా పథకాలు తమ రాష్ట్రంలో ఎందుకు లేవంటూ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక..పేద ప్రజల ఖాతాల్లో నేరుగా లక్ష కోట్లు జమ చేశారన్నారు.
వివిధ రకాల సంక్షేమ పథకాలతో మంచిపేరు తెచ్చుకున్న వైఎస్ జగన్..పోలవరం (Polavaram) నిర్వాసితుల పట్ల కూడా ఇదే విధానం అమలు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. 2013 భూ సేకరణ చట్టం రాకముందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అదే విధానాల్ని అమలు చేశారని చెప్పారు. వైఎస్సార్ విధానాలను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే మరింత మంచి జరుగుతుందని మేధా పాట్కర్ కూడా ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.
Also read: YS Jagan: తెలంగాణ వైఖరిపై మరోసారి ప్రధాని మోదీకు వైఎస్ జగన్ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook