సీనియర్ సిటిజన్స్‌కి తిరుమల ఆలయంలో ప్రత్యేక దర్శనం ఎలా....?

తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం విచ్చేసే వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్స్) టిటిడీ బోర్డు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంది.

Last Updated : Apr 17, 2018, 06:36 AM IST
సీనియర్ సిటిజన్స్‌కి తిరుమల ఆలయంలో ప్రత్యేక దర్శనం ఎలా....?

తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం విచ్చేసే వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్స్) టిటిడీ బోర్డు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంది. టి.టి.డి వారి దృష్టిలో సీనియర్ సిటిజన్స్ అంటే... అరవై ఐదు (65) సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే.

* 65 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ సీనియర్ సిటిజన్స్ గా పరిగణించరు.

* ఒకవేళ భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్ళేట్లయితే మాత్రం భర్తకి 65 సంవత్సరాలు దాటి ఉంటే... అతనియొక్క ధర్మపత్నికి 65 సంవత్సరాలు దాటాకపోయినా పర్వాలేదు. కానీ, మహిళలు అయినా పురుషులైనా విడివిడిగా వెళ్ళేట్లయితే మాత్రం ఖచ్చితంగా 65 సంవత్సరాలు దాటి ఉండవలసిందే.

* ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు తిరుమలలోని మ్యూజియం ఎదురుగా ఉన్న సీనియర్ సిటిజెన్స్ ప్రత్యేక కౌంటర్ నందు సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించిన ప్రత్యేక దర్శనం టోకెన్లు ఇస్తారు.

* సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించి శ్రీవారి దర్శనానికి రెండు స్లాట్లు ఉంటాయి. మొదటి స్లాట్ ఉదయం 10-00 గంటలకు. రెండవ స్లాట్ మధ్యాహ్నం 3-00 గంటలకు.

* ఈ స్లాట్లలో దర్శనానికి వెళ్లిన సీనియర్ సిటిజన్స్‌కి సుమారుగా గంట లేదా గంటన్నర సమయంలోనే శ్రీవారి దర్శనం పూర్తి అవటానికి అవకాశం ఉంది.

* ప్రతి శుక్రవారం నాడు మాత్రం శ్రీవారికి అభిషేకం ఉంటుంది కాబట్టి మొదటి స్లాట్ అయినటువంటి ఉదయం 10-00 గంటల స్లాట్ ఉండదు.

* సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించి ఒక రోజుకి 1500 టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 1500 టోకెన్లలో 750 టోకెన్లు ఉదయం 10-00 గంటల స్లాట్ కోసం ఇస్తారు.

* 750 టోకెన్లు ఇవ్వటం అయిపోయిన తర్వాత ఇరవై నిమిషాలు గ్యాప్/విరామం ఇచ్చి, మధ్యాహ్నం 3-00 గంటలకి సంబంధించిన రెండవ స్లాట్ కొరకు మరొక 750 టోకెన్లు ఇవ్వటం జరుగుతుంది.

* సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించిన టోకెన్లు పొందటం కోసం ప్రతి ఒక్కరూ తమ తమ ఆధార్ కార్డు (ఫోటోతో వున్న వయసు నిర్ధారణ పత్రం) ఒరిజినల్ తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది.

* స్పెషల్ నోట్1: ఒకవేళ సీనియర్ సిటిజన్స్ సరిగా నడవలేని లేదా సహాయం అవసరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారితో పాటు సహాయంగా ఎవరినీ అనుమతించరు. కానీ వారియొక్క సహాయార్థం టి.టి.డి యాజమాన్యం యువతీ యువకులతో కూడిన స్కౌట్స్ అండ్ గైడ్స్ ని ఏర్పాటు చేస్తుంది. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ చాలా జాగ్రత్తగా సీనియర్ సిటిజన్స్‌కి దగ్గరుండి దర్శనం పూర్తి చేయించి ఆలయం వెలుపలికి తీసుకొని వస్తారు.

* ఉచితంగా, సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఇస్తారు. వారికి ₹20/- లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత ₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారు.

* స్పెషల్ నోట్ 2: ఒకవేళ సీనియర్ సిటిజన్స్ కోటాలో టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్లిన వారు మళ్ళీ 90 రోజులవరకూ సీనియర్ సిటిజన్స్ కోటా ఉపయోగించుకునే అవకాశం ఎంతమాత్రం ఉండదు. మిగిలిన అన్ని రకాల దర్శన పద్ధతుల్లో శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చు.

 

Trending News