Gold and Silver prices : 2 వారాల తర్వాత స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరల్లో మంగళవారం నాడు స్వల్ప తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ క్షీణించడమే దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గడానికి ఓ కారణమయ్యాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Last Updated : Dec 31, 2019, 08:35 PM IST
Gold and Silver prices : 2 వారాల తర్వాత స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్: గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరల్లో మంగళవారం నాడు స్వల్ప తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ క్షీణించడమే దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గడానికి ఓ కారణమయ్యాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.20 మేర తగ్గి రూ.40,670 పలుకుతుండగా 22 క్యారట్ల బంగారం ధరలు రూ.30 మేర తగ్గి రూ.37,270 వద్ద ట్రేడ్ అవుతోంది. పసిడి బాటలోనే వెండి సైతం రూ.50 మేర తగ్గి రూ.49,300 వద్ద ట్రేడ్ అవుతోంది. ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడ, బీచ్ సిటీ విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధరలు రూ.40,670 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారట్ల బంగారం ధరలు రూ.37,270 పలుకుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలోనూ 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.50 మేర తగ్గి రూ39,250 నమోదవుతుండగా 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం రూ.50 మేర తగ్గి రూ.38,050 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి విషయానికొస్తే, కిలో వెండి ధరలు రూ.50 మేర తగ్గి రూ.49,300 పలుకుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here

Trending News