భగ భగ మంటున్న భానుడు ; తీవ్రమైన వడగాల్పులతో జాగ్రత్త !!

 ఉదయం 10  దాటిందంటే చాలు.. బయట కాలుపెట్టాలంటేనే భయపడతున్నారు జనాలు

Last Updated : May 27, 2019, 11:31 AM IST
భగ భగ మంటున్న భానుడు ; తీవ్రమైన వడగాల్పులతో జాగ్రత్త !!

ఏపీలో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచే భగ భగ మంటున్న ఎండలతో  జనాలను బాంబేలెత్తిపోతున్నారు. ఈ రోజు ఎండల తీవ్రత 44 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాస్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది. ఈ జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎండలు అదరగొడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు

తీవ్రమైన వడగాల్పులు ..జాగ్రత్త
భగభగ మండే ఎండలతో పాటు  తీవ్రమైన వడగాలులు వీచే అవాకాశముందని హెచ్చరిలకు జారీ అయిన నేథఫ్యంలో సాధ్యమైంత వరకు బయట తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో బయటికి వెళ్లే పరిస్థితి వస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేతరంగు వస్త్రాలు ధరించే బయటకు వెళ్లాలనీ పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాబోయే మూడు రోజుల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 

Trending News