ఏపీలో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత

ఏపీలో నెల రోజులుగా కరోనా మరణాల కన్నా కొన్ని గంటలపాటు ఈదురుగాలులు, వర్షాలు (Heavy Rain In AP) ఎక్కువ మందిని బలితీసుకున్నాయి.

Last Updated : Apr 10, 2020, 07:55 AM IST
ఏపీలో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత

అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు చనిపోయారు. కానీ గురువారం రోజు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాటుకు ఏకంగా 14 మంది మరణించారు. నెల్లూరులో జిల్లాలో గరిష్టంగా ఏడుగురు చనిపోగా, గుంటూరులో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒక్కరు మరణించారు.  పుంజుకున్న బంగారం ధరలు.. వెండి జోష్

ఈదురుగాలులకు పడవలు ముక్కలైన కారణంగా కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన నలుగురు మత్స్యకారులు చనిపోయారు. పలు జిల్లాల్లో కోతకొచ్చిన పంట వర్షం పాలయ్యింది. మామిడి పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, మిర్చి ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.  ఏపీలో కరోనా కేసులు, మరణాలు.. పూర్తి వివరాలు

నెల్లూరు జిల్లాలో 103.5 మిల్లిమీటర్లు, గూడూరులో 100.5మి.మీ, ప్రకాశం జిల్లాలో 94.5మి.మీ, కర్నూలు జిల్లా శ్రీశైలంలో 82.25మి.మీ మేర వర్షపాత నమోదైంది. ముఖ్యంగా ఈదురుగాల తీవ్రతకు తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు నెలకూలాయి. అసలే లాక్‌డౌన్ కావడంతో విక్రయాలు జరగని చేతికొచ్చిన పంట క్షణాల్లో వర్షానికి తడిసి ముద్దకావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  Pushpa మూవీ ఫస్ట్ లుక్‌పై ఫన్నీ మీమ్స్!

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు 7వేల హెక్టార్ల వరి, 400 హెక్టార్ల మొక్కజొన్న పంట నాశనమైంది. వీటితో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిరప రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. శ్రీకాకుళం జిల్లాలో పొద్దుతిరుగుడు, జీడి మామిడి, మామిడి దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో పసుపు తడిచిపోయింది. కరోనా కన్నా ప్రకృతి వైపరీత్యాల (భారీ వర్షాలు, పిడుగులు)తో ఒక్కరోజులోనే భారీగా మరణాలు సంభవించాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photo

Trending News