Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. నిండు కుండల్లా ప్రాజెక్టులు..

Heavy Rains: నైరుతి ఋతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచి కొడుతున్నాడు. అంతేకాదు కృష్ణా, గోదావరి పరివాహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాములు నిండు కుండల్లా కళ కళ లాడుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే.. ఈ నెలాఖరు వరకు శ్రీశైలం ప్రాజెక్ట్ నిండే అవకాశాలు ఉన్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 26, 2024, 09:06 AM IST
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. నిండు కుండల్లా ప్రాజెక్టులు..

Heavy Rains: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల చురుకుగా కదులుతున్నాయి దీంతో ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా చూస్తే పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఇక ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా, గోదావరి బేసిన్లలో వరద ప్రవాహం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాదు ఇక్కడ ఉపరితలంపై బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది.

Add Zee News as a Preferred Source

ఇక తెలంగాణలోని ఈ రోజు రేపు కూడా పలు  జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాదు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందు కోసం అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు 30- 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రేపు  కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అటు ఆంధ్రప్రదేశ్ లోని మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావారణ కేంద్రం తెలపింది. ఉండి,  కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News