అల్పపీడన ద్రోణి ప్రభావం: సీమకు భారీ వర్ష సూచన

రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం

Updated: Sep 11, 2018, 04:21 PM IST
అల్పపీడన ద్రోణి ప్రభావం: సీమకు భారీ వర్ష సూచన

దక్షిణ కర్ణాటక నుంచి కొమరన్ తీరం వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాయలసీమలో వచ్చే 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయని, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవన ద్రోణి ఉత్తరాదికి మళ్లడంతో తమిళనాడు, రాయలసీమలో వర్షాలు పడేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందని, దీని ఫ్రభావం రెండు రోజులసాటు ఉంటుందని పేర్కొంది.

ఆగస్టులోనూ తక్కువ వర్షపాతమే

న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా భిన్నంగా వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. భారీ వర్షాలు, వరదలతో కేరళకు తీవ్రనష్టం వాటిల్లగా, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మరికొన్ని రాష్ట్రాల్లో అతిగా వర్షాలు కురిశాయని.. అదే సమయంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో జూన్- ఆగస్టు నెలల్లో సాధారణం వర్షపాతం కంటే తక్కువగా నమోదైందని ఐఎండీ వివరించింది. అయితే, దేశ వ్యాప్తంగా చూస్తే వర్షాలు మంచిగానే కురిశాయంది.