విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ( Vizag gas leak ) తీవ్రంగా అనారోగ్యం బారిన పడిన బాధితులను చూసి తర్వాత ఇంకేం జరుగుతుందోననే ఆందోళన, భయం గ్రామస్తులను వెంటాడుతున్న నేపథ్యంలో బాధితులకు భరోసా కల్పించేందుకు మంత్రులు, అధికారులు ఇక్కడే ఉంటామని మంత్రి అవంతీ శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా కింద అందించనున్నట్టు సీఎం వైఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు నేడు మంత్రుల బృందం సంబంధిత అధికారులతో కలిసి వెళ్లి బాధితులకు చెక్కులు అందించారు.
విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ ( Gas leak tragedy ) అయిన ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారి మృతదేహాలతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు శనివారం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ (LG polymers chemical plant) ఎదుట ఆందోళనకు దిగారు.
విశాఖలో విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పై చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు పెట్టారన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు.
Vizag gas leak tragedy విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాతో పాటు అనారోగ్యం బారినపడి ఆస్పత్రిపాలైన వారికి అందించ నష్టపరిహారం కింద రూ. 30 కోట్లు విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ( AP govt ) శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
విశాఖ రసాయన కంపెనీలో గ్యాస్ లీక్.. ఒక్కో కుటుంబంలో క్రమక్రమంగా విషాదం నింపుతోంది. ఇవాళ (గురువారం) ఉదయం 5గా ఉన్న మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నవారు ఒక్కరొక్కరుగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
విశాఖలో గ్యాస్ లీక్ ప్రమాదం కారణంగా.. అక్కడ అంతా ఉద్రిక్త పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి గ్యాస్ లీకేజీ పూర్తిగా తగ్గిపోయినప్పటికీ .. గాలిలో ఉన్న విష వాయువులు .. స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐతే విష వాయువులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కీలకాంశాలు విడుదల చేసింది.
విశాఖపట్నం రసాయన కంపెనీలో చెలరేగిన గ్యాస్ లీకేజీ వ్యవహారం స్థానికంగా పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఇప్పటి వరకు గ్యాస్ లీకేజీ ఘటన కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరుకుంది. ఇప్పటికీ పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .. వారిని పరామర్శించేందుకు విశాఖ చేరుకున్నారు.
విశాఖపట్నంలో తెల్లవారుజామునే విషాదం నెలకొంది. ఓ రసాయన పరిశ్రమలో లీకైన గ్యాస్ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మంది వరకు ఆస్పత్రిపాలయ్యారు. అత్యంత దురదృష్టకరమైన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.