మాతో పెట్టుకుంటే, మీ పనే ఖతం అవుతుంది: బీజేపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

మాతో పెట్టుకుంటే, మీ పనే ఖతం: బీజేపీ నేతలకు చంద్రబాబు బెదిరింపు

Last Updated : Jan 5, 2019, 03:15 PM IST
మాతో పెట్టుకుంటే, మీ పనే ఖతం అవుతుంది: బీజేపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

కాకినాడ: తమతో పెట్టుకుంటే, మీ పనే ఖతం అవుద్దని కాకినాడలో తన కాన్వాయ్‌ని అడ్డుకున్న బీజేపీ నేతలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పుకుని ప్రజల్లోకి వెళ్తే, ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టరు జాగ్రత్త అని బెదిరింపులకు పాల్పడిన చంద్రబాబు.. మోదీకి మద్దతు పలుకుతున్నందుకు సిగ్గుపడాలి అంటూ బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు. శుక్రవారం ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు కాకినాడకు వచ్చారు. అయితే, ఇటీవల ప్రధాని మోదీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ పలువురు స్థానిక బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.

 

 

Trending News