తెలంగాణ ఇంటర్ ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రధానంగా రాజధాని హైదరాబాద్ నగరంలో ఆందోళనలు తీవ్రతరం చేశారు ఇంటర్ బోర్డు ముట్టకి అఖిలపక్షం పిలుపు ఇచ్చింది. విద్యార్ధులకు న్యాయం చేయాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు,విద్యార్ధి సంఘాల ఆందోళన దీంతో ఇంటర్ బోర్డు దగ్గర టీడీపీ, సీపీఐ జనసేన ఆందోళనను తీవ్ర తరం చేశాయి. ప్రగతి భవన్ ముందు ఏబీవీపీ విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అలాగే జిల్లా కేంద్రాల్లో ఆందోళనను ముమ్మరం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు న్యాయం చేయాలని.. ప్రస్తుతం మార్కుల అవకతవకలపై రీ వ్యాల్యూషన్ కు విద్యార్ధి సంఘాల డిమాండ్ చేశాయి
తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. పలుపార్టీ నేతలు, విద్యార్ధి సంఘాల నేతలు అరెస్ట్ చేశారు. ముందస్తు అరెస్టుల ప్రక్రియలో భాగంగా పొన్నాల, వీహెచ్ అరెస్ట్ చేశారు. ఇంటర్ బోర్డు ముట్టడికి బయల్దేరిన టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అరెస్ట్ పాతబస్తీలో అంజన్ కుమార్, అనీన్ కుమార్ యాదవ్ అరెస్ట్ చేశారు. ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించిన టీజేఎస్ కార్యకర్తల పోలీసులు అరెస్ట్ చేశారు. కోదండరాం ఇంటి ముందు పోలీసుల మొహరించారు. ఇంటర్ బోర్డుదగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసి భారీగా పోలీసుల మొహరించారు
ఇంటర్ బోర్డు అక్రమాలకు నిరసనగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్షణ్ నిరధిక నిరాహార దీక్షకు దిగారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలోనే ఆయన దీక్షకు చేపడుతున్నారు. ఇంటర్ బోర్డు అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ను సప్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మార్కుల అవకతవలకపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్..అది సాధ్యం కాకపోతే సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు