జనసేనకు మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై చెబుతున్నారా ?

జనసేన వీడి వైసిపిలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే !

Updated: Oct 4, 2019, 06:55 PM IST
జనసేనకు మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై చెబుతున్నారా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్

రాజమహేంద్రవరం: జనసేన పార్టీకి నేతలు ఒక్కొక్కరిగా షాక్ ఇస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తాజాగా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. 

2019 ఎన్నికల్లో జనసేన తరపున రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ ఓటమిపాలయ్యారు. అంతకన్నా ముందుగా 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆకుల.. 2019 ఎన్నికలకు ముందే బీజేపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.