MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు.. సీబీఐ డైరెక్టర్‌కు లేఖ

MP Avinash Reddy Letter to CBI Director: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఎస్పీ రామ్‌సింగ్‌పై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసును పక్షపత ధోరణితో విచారణ జరిపారని లేఖలో ఆరోపించారు. లేఖ సారాంశం ఇది..

Written by - Ashok Krindinti | Last Updated : Jul 23, 2023, 07:43 PM IST
MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు.. సీబీఐ డైరెక్టర్‌కు లేఖ

MP Avinash Reddy Letter to CBI Director: మాజీ మంత్రి వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రామ్‌సింగ్‌పై ఫిర్యాదు చేస్తూ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. పక్షపాత వైఖరితో రామ్‌సింగ్ దర్యాప్తు చేశారని ఆరోపించారు. రామ్‌సింగ్ చేసిన దర్యాప్తు తీరును సమీక్షించాలని కోరారు. గతంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ల ఆధారంగా లేఖ రాశారు. వివేకా రెండో వివాహం బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలు లేఖలో ప్రస్తావించారు. దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్‌సింగ్ విచారణ జరిపారని అన్నారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి ఉండొచ్చనే కోణంలో విచారణ జరగలేదన్నారు. మున్నా లాకర్లో నగదుకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరూ చెప్పారని అడిగారు.  

విచారణ అధికారిగా బాధ్యతలు తీసుకోకముందే  రామ్‌సింగ్ నిబంధనలకు వ్యతిరేకంగా విచారణ జరిపారని అవినాష్ రెడ్డి అన్నారు. తనతో పాటు తమ తండ్రి భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు సాక్ష్యులను ఆయన బెదిరించారని పేర్కొన్నారు. తన పేరు చెప్పాలంటూ పీఏ కృష్ణారెడ్డిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని అన్నారు. రామ్‌సింగ్ వేధింపులు భరించలేక కృష్ణారెడ్డి, కడప ఎస్పీ పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేసిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. పలువురు సాక్ష్యాలు చెప్పిన స్టేట్‌మెంట్లను రామ్‌సింగ్ పూర్తిగా మార్చి రాశారని ఎంపీ అన్నారు. 

హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరిని అరెస్ట్ చేయకుండా సీబీఐ ఆలస్యం చేసిందన్నారు అవినాష్ రెడ్డి. అదేవిధంగా దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అటు సీబీఐ కానీ.. సునీత కానీ వ్యతిరేకించలేదని అన్నారు. విచారణలో రామ్‌సింగ్ చేసిన తప్పులను సవరించాలని కోరారు. నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలని విన్నవించారు.
 
కాగా.. కర్ణాటక క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ ఇటీవలె సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. గతంలో పనిచేసిన రామ్ సింగ్ స్థానంలో ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. కొత్త డైరెక్టర్ రావడంతో గతంలో జరిగిన విచారణ తీరును అవినాష్ రెడ్డి వివరించారు. రామ్‌సింగ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ.. వివేకా హత్య కేసు మొత్తం పక్కదారి పట్టిందన్నారు. 

Also Read: Anakapalle Child Death: చిన్నారిని గరిటెతో కొట్టిన తల్లి.. 16 నెలల పసికందు మృతి  

Also Read: Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News