అమరావతి: 'దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న కోపాన్ని, కక్షను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారేమో' అని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసి రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. 'వైఎస్సార్ బతికున్నప్పుడు.. టీఆర్‌ఎస్‌ను లేకుండా తుడిచిపెట్టేయాలని వైఎస్ భావించారు. ఒకవేళ వైఎస్ బతికుంటే టీఆర్‌ఎస్ ఉండేది కాదు. అందుకే వైఎస్సార్‌పై ఉన్న ఈ ప్రతీకారంతోనే ఇప్పుడు జగన్‌తో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటున్నారేమోనని అనిపిస్తోంది' అని తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. 'టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని వైఎస్ జగన్ సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు' అని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఫెడరల్ ఫ్రంట్‌లోకి వైఎస్సార్సీపీని ఆహ్వానించేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లి వైఎస్ జగన్‌తో భేటీ అవడంపై స్పందించే క్రమంలో బుధవారం మీడియాతో మాట్లాడుతు తులసి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.