Konaseema: పెళ్లి వేడుకలో విందు భోజనం తిని 17 మందికి తీవ్ర అస్వస్థత.. మండపేట ఆసుపత్రికి తరలింపు

17 People Fall Sick after Eating Food At Wedding Function:  పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన ఓ శుభకార్యంలో విందు భోజనం చేసి 17 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కోనసీమ జిల్లా మండపేటలో చోటు చేసుకుంది. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 21, 2022, 11:13 AM IST
  • కోనసీమ మండపేట పెళ్లి వేడుకలో బంధువులకు అస్వస్థత
  • పెళ్లిలో విందు భోజనం తిని 17 మందికి అస్వస్థత
  • మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిక
Konaseema: పెళ్లి వేడుకలో విందు భోజనం తిని 17 మందికి తీవ్ర అస్వస్థత.. మండపేట ఆసుపత్రికి తరలింపు

17 People Fall Sick after Eating Food At Wedding Function: కోనసీమ జిల్లాలోని మండపేటలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కలుషిత భోజనం తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యురాలు ప్రియాంక వాహిని వెల్లడించారు. శుక్రవారం (ఆగస్టు 19) రాత్రి అంతా భోజనం చేసి పడుకోగా.. శనివారం (ఆగస్టు 20) తెల్లవారుజామున కొందరు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్‌కి కారణమేంటనేది ఇంకా తెలియలేదు.

మండపేటకు చెందిన సిద్ధాంతపు నాగేశ్వరరావు కుమార్తె పెళ్లి వేడుకకు వచ్చిన పలువురు బంధువులు ఇలా అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి శనివారం (ఆగస్టు 20) జరగాల్సి ఉండగా.. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఓ వేడుకలో బంధువులంతా పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనం మిగిలిపోవడంతో.. అదే భోజనాన్ని రాత్రి బంధువులంతా తిని పడుకున్నారు. తెల్లవారుజాము సమయంలో ఒక్కసారిగా పలువురు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 17 మందిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైనవారిలో అంతా పెద్ద వయసు వారే ఉన్నారు.

ఫుడ్ పాయిజన్‌ అయిన ఆ భోజనం ఓ హోటల్ నుంచి ఆర్డర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం తిన్నప్పుడు అందరూ బాగానే ఉన్నప్పటికీ.. తెల్లవారుజామున అస్వస్థతకు గురవడం గమనార్హం. ఫుడ్ డెలివరీ చేసిన హోటల్ గురించి పెళ్లి వేడుకకు హాజరైన బంధువులు ఆరా తీస్తున్నారు. 

Also Read: Roja Daughter Anshumalika as Heroine: ఆ హీరో సరసన హీరోయిన్ గా రోజా కుమార్తె

Also Read: Realme 9 Pro 5G: ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్.. కేవలం రూ.1999కే రూ.19 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News