Realme 9 Pro 5G: ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్.. కేవలం రూ.1999కే రూ.19 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్..

Realme 9 Pro 5G Smartphone: రియల్‌మీ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ సద్వినియోగం చేసుకుంటే డెడ్ చీప్ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 21, 2022, 09:09 AM IST
  • రియల్‌మీ స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ తగ్గింపు
  • రియల్2మీ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్
  • ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా కేవలం రూ.999కే
Realme 9 Pro 5G: ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్.. కేవలం రూ.1999కే రూ.19 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్..

Realme 9 Pro 5G Smartphone: ఆఫర్లకు కేరాఫ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్. ఈ రెండు ఈకామర్స్ సంస్థలు కస్టమర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్‌ను ప్రకటిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ ఫోన్లలో రియల్‌మీ 9 ప్రో 5జీ (6జీబీ, 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో డెడ్ చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ :

రియల్‌మీ 9 ప్రో 5జీ (6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) అసలు ధర రూ.21,999. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌పై 13 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా కస్టమర్స్‌ ఈ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.18,999కే కొనుగోలు చేయవచ్చు. అలా రూ.3 వేలు వరకు ఆదా అవుతుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు చెల్లింపులు జరిపినట్లయితే మరో రూ.250 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో డెడ్ చీప్ ధరకే :

రియల్‌మీ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే గరిష్ఠంగా రూ.17 వేలు వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇది పూర్తిగా మీ మొబైల్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పూర్తి ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తించినట్లయితే రూ.18,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని డెడ్ చీప్‌గా రూ.1999కే మీ సొంతం చేసుకోవచ్చు.

రియల్‌మీ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్ :

6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 256 ఎక్స్‌పాండెబుల్ డేటా స్టోరేజీ
6.6 అంగుళాల మొబైల్ డిస్‌ప్లే
64MP + 8MP + 2MP బ్యాక్ కెమెరా సెటప్ | 16MP ఫ్రంట్ కెమెరా సెటప్
5000 mAh బ్యాటరీ సామర్థ్యం
క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ 

Also Read: Manjunatha Reddy Death: వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడిది ఆత్మహత్యే.. అంత్యక్రియల సందర్భంగా బోరున ఏడ్చిన ఎమ్మెల్యే

Also Read:Amit Sha Munugodu Meeting Live Updates: షెడ్యూల్ కు గంట ముందే హైదరాబాద్ కు  అమిత్ షా.. మునుగోడు సభలో  కేసీఆర్ కు కౌంటర్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News