Liquor sales in weekly market in tanuku video viral: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి సర్కారు ప్రభుత్వ ఏర్పడితే.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ప్రజలకు అందేలా చూస్తామని హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవల చంద్రబాబు సర్కారు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. అంతే కాకుండా.. రూ. 99 కే నాణ్యమైన మద్యంను మందుబాబులకు అందేలా చర్యలు తీసుకుంది.
ఏపీలో మద్యం ఏకంగా వీధులు, సంతల్లోకి వచ్చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇదిగో... ఇలా సంతలో నేరుగా మద్యం అమ్ముతూ ప్రజలను మత్తులో ముంచుతున్నారు... ఇదేనా శాడిస్ట్ @ncbn చెప్పుకుంటున్న మంచి ప్రభుత్వం#SaveAPFromTDP#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule#MosagaduBabu… pic.twitter.com/flCKyDbrrK
— YSR Congress Party (@YSRCParty) October 27, 2024
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఏపీలో కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చినప్పటి నుంచి ప్రతిరోజు లిక్కర్ కు సంబంధించిన ఏదో ఒక అంశం వార్తలలో ఉంటుంది. తాజాగా, పశ్చిమ గోదావరిలోని తణుకులో స్థానికంగా ఆదివారం సంత జరిగింది. ఈ మార్కెట్ లో కూరగాయలు అమ్మినట్లు లిక్కర్ బాటిళ్లను కొంత మంది విక్రయించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
సాధారణంగా ఏ గ్రామంలో అయిన పట్టణంలో అయిన వారానికి ఒక రోజు కూరగాయల సంత జరుగుతు ఉంటుంది. సంతలో మనకు కావాల్సిన కూరగాయలు, ఫ్రూట్స్ లను ఒక చోట తీసుకొచ్చి రైతులు అమ్ముతుంటారు. చాలా మంది వారానికి సరిపడ కూరగాయల్ని ఒకేసారి కొంటుంటారు. అయితే.. ఇప్పటి వరకు సంతలో కూరగాయలు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి మాత్రమే దొరికేవి .. కానీ ఇప్పుడు లిక్కర్ బాటిళ్లు కూడా మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి.
ఆదివారం రోజున పశ్చిమ గోదావరిలోని తణుకులో సంత జరుగుతుంది. అక్కడ కొంత మంది యువకులు ప్రత్యేకంగా టేబుల్స్ లను ఏర్పాటు చేసి మరీ మద్యం విక్రయిస్తున్నారు. అచ్చం కూరగాయలు అమ్మినట్లు లిక్కర్ అమ్ముతున్నరన్న మాట. దీంతో అక్కడ కొంత మంది మందుబాబులు లిక్కర్ కొనుగోలు చేయడం జరిగింది.
అయితే.. కొంత మంది దీన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా.. పోలీసులకు సమాచారం ఇచ్చారంట. వెంటనే ఆబ్కారీ అధికారులు అక్కడికి చేరుకుని, కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.