Pawan Kalyan Vizag Tour Live Updates: విశాఖ విడిచివెళ్లాలని పవన్ కు నోటీసులు.. జనసేనాని ఏం చేస్తారో?

Pawan Kalyan Vizag Tour:  విశాఖపట్నంలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో నగరవాసులు ఉన్నారు

Last Updated : Oct 16, 2022, 02:07 PM IST
Pawan Kalyan Vizag Tour Live Updates: విశాఖ విడిచివెళ్లాలని పవన్ కు నోటీసులు.. జనసేనాని ఏం చేస్తారో?
Live Blog

Pawan Kalyan Vizag Tour:  విశాఖపట్నంలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో నగరవాసులు ఉన్నారు. శనివారం సాయంత్రం నుంచి విశాఖలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. విశాఖ గర్జనకు వచ్చి వెళుతున్న ఏపీ మంత్రులపై  విమానాశ్రయంలో జనసేన కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపింది. ఆ తర్వాత విశాఖలో జరిగిన పవన్ ర్యాలీ ఉద్రిక్తతల మధ్యే సాగింది. పవన్ ర్యాలీ సాగిన రూట్లో పవర్ కట్ అయింది. దీంతో కార్యకర్తల మొబైల్ లైట్ల వెలుతురులోనే పవన్ ముందుకు సాగారు. విమానాశ్రయంలో జరిగిన ఘటనకు సంబంధించి కొందరు జనసేన నేతలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల తీరుపై జనసేన చీఫ్ తీవ్రంగా స్పందించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

16 October, 2022

  • 14:06 PM

    విశాఖ జనసేన నేతల అక్రమ అరెస్టులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ చేస్తున్న కుట్రలు దుర్మార్గమన్నారు చంద్రాబబు.  పవన్ బస చేస్తున్న హోటల్‌లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన జనసేన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

     

  • 13:10 PM

    పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు

    సాయంత్రం 4 గంటల లోగా విశాఖను విడిచివెళ్లాలవు 41ఏ నోటీసులు

    అనుమతి లేకుండా కార్యక్రమాలు చేయవద్దని ఆదేశం

     

  • 10:31 AM

    పోలీసులు జనసేన కార్యకర్తలపై జులుం చూపించారు

    మేము ఏమైనా సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నామా- పవన్

    వైఎస్ వివేకా హత్య కేసును ఎందుకు పరిష్కరించలేదు

    పోలీసులు ప్రభుత్వ సూచనలు పాటిస్తున్నారు

    పోలీసులు అడ్డగోలుగా ప్రభుత్వానికి కొమ్ము కాశారు

    ఏపీ పోలీసులపై నమ్మకం లేదని గతంలో వైసీపీ నేతలు చెప్పారు

    బూతులు తిట్టడానికే పాలనా వికేంద్రీకరణ

    ఒకటే రాజధాని ఉండాలని మేము అనుకున్నాం

    అమరావతి రాజధానిగా ఉండాలన్నది జనసేన విధానం

    రాజు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా- పవన్

    దోపిడి చేసేవాళ్లు, నేరస్తులకు పోలీసులు అండగా నిలుస్తారు

  • 10:26 AM

    వైసీపీ కార్యక్రమం కంటే ముందే జనసేన కార్యక్రమం ఫిక్సైంది

    ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే జనవాణి

    బూతు పురాణం తప్పిదే రాష్ట్రంలో ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు

    వైసీపీ కార్యక్రమాన్ని భగ్నం చేయడం మా లక్ష్యం కాదు

  • 10:15 AM

    విశాఖ పోర్టు స్టేడియం దగ్గర జనసేన జనవాణి కార్యక్రమం

    పవన్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఆందోళనలు

    మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ కార్యకర్తల నినాదాలు

    పవన్ గో బ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తల ఆందోళనలు

    పోటాపోటీ నిరసనలతో విశాఖలో హై టెన్షన్

    ఇరు వర్గాలను అక్కడి నుంచి తరలిస్తున్న పోలీసులు

  • 10:02 AM

    అరెస్ట్ చేసిన జనసేన కార్యకర్తలను వెంటనే విడుదల చేయకపోతే  పోలీస్ స్టేషన్ కు వెళ్లి ధర్నా చేస్తానని హెచ్చరించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దీంతో పవన్ బస చేసిన హోటల్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్ చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. హోటల్ నుంచి బయటికి రాకుండా పవన్ కల్యాణ్ ను హౌజ్ అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.

Trending News