చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ వస్తున్నారు: మమతా బెనర్జీ

చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ వస్తున్నారు: మమతా బెనర్జీ

Last Updated : Oct 8, 2018, 11:38 AM IST
చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ వస్తున్నారు: మమతా బెనర్జీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖర్‌రావుకి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరి 19వ తేదీన కోల్‌కతాలో తాము నిర్వహిస్తున్న భారీ ప్రదర్శనలో పాల్గొనాలని ఆమె కోరారు. 2019 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యతను ఈ ర్యాలీ ద్వారా చూపించాల్సిన అవసరముందని ఆమె లేఖలో పేర్కొన్నారు.

‘దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇదొక మంచి వేదిక. ఇక్కడి నుంచే మన గళాన్ని వినిపిద్దాం. మీరూ ఈ ర్యాలీలో పాల్గొని దేశ సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడతారని ఆశిస్తున్నాను.’’అని దీదీ లేఖలో వివరించారు.

దీదీ.. చంద్రబాబు, కేసీఆర్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల అధినేతలందరికీ పిలువనున్నారని సమాచారం. ప్రముఖ జాతీయ మీడియా కథనం మేరకు..'ప్రతిపక్ష పార్టీలను ర్యాలీకి ఆహ్వానిస్తాం. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఒమర్ అబ్దుల్లా నుండి కన్ఫర్మేషన్ అందింది. వారు జనవరి 19న కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ వద్ద జరిగే  ప్రదర్శనను హాజరవుతారని సమాచారం అందింది.' అని దీదీ చెప్పారు.

యుపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ, పటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్, సీనియర్ లెఫ్ట్ పార్టీ నాయకులతో సహా ఇతర బీజేపీ వ్యతిరేక నాయకులను తమ పార్టీ ఆహ్వానించనున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. కమ్యూనిస్టులకు స్థిరమైన సిద్ధాంతాలు లేవు.. కానీ, మార్కిస్ట్ నేతలందరూ చెడ్డవారుకాదని అనుకుంటున్నా.. కాబట్టి  కేరళ సీఎం పి. విజయన్‌తోపాటు ఆర్ఎస్పీ, సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలను కూడా ఆహ్వానిస్తామని ఆమె అన్నారు.

Trending News