AP, Telangana weather updates: ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు

AP, Telangana weather updates: విశాఖపట్నం, హైదరాబాద్: ఉత్తర అండమాన్ సముద్రతీరంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 11:45 AM IST
AP, Telangana weather updates: ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు

AP, Telangana weather updates: విశాఖపట్నం, హైదరాబాద్: ఉత్తర అండమాన్ సముద్రతీరంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో ఈ అల్ప పీడనం దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తాంధ్ర తీరాలకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Telangana, AP weather updates) తెలిపారు.

Also read : Hyderabad Heavy Rains: ఆగకుండా కురిసిన వర్షానికి ఆగమైన రాజధాని.. Videos 

తెలంగాణ, ఏపీలో ఇప్పటికే గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో పాటు ప్రాజెక్టుల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

అనేక రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఎడతెరిపి లేకుండా వరుసగా కురిసిన భారీ వర్షాలతో (Heavy rains in TS and AP) ప్రాజెక్టులు నిండు కుండలా మారడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Also read : Huzurabad bypolls candidates: హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 30 మంది పోటీ

Also read : Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News