Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద..

Nagarjuna Sagar: కృష్ణమ్మ ఉరకలేస్తోంది. కృష్ణా బేసిన్ లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణమ్మ పరివాహాక ప్రాంతాల్లోని డ్యాములు నిండు కుండలను తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోవడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదిలారు. దీంతో నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 30, 2024, 10:19 AM IST
 Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద..

Nagarjuna Sagar: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. ఆ నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా కళ కళ లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోయింది. ఈ నేపథ్యంలో  శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాదు శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్పత్తిని చేస్తూ నీటిని దిగువకు ఒదలుతున్నారు.

కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం భారీగా ఉండటంతో  రిజర్వాయర్లలో నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఆలమట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి లక్షా 34 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదలుత్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.67 లక్షల క్యూసెక్కుల వరద ఉండటంతో మూడు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేస్తున్నారు. మరో 250 టీఎంసీల నీరు శ్రీశైలంలోకి వస్తే నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుతాయని అధికారులు చెబుతున్నారు.

నాగార్జున సాగర్‌ దిశగా శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఈ సందర్బంగా నిన్న అధికారులు కృష్ణమ్మ ప్రత్యేక పూజల అనంతరం నీటిని దిగువకు విడుదల చేశారు.  శ్రీశైలం మూడు గేట్లు ఎత్తి దిగువకు 1.62 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి 4.67 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతూనే ఉంది.  మొత్తంగా ఆల్ మట్టి నుంచి శ్రీశైలం వరకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మరొ కొన్ని రోజులు ఇదే వరద కొనసాగితే.. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిపోతాయి.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News