Minister Roja: జైలుకు పంపించకుండా.. జైలర్ సినిమాకు పంపిస్తారా..? నారా లోకేష్‌కు మంత్రి రోజా కౌంటర్

Minister Roja Counter to Nara Lokesh: చంద్రబాబు నాయుడి అరెస్ట్‌తో సీఎం జగన్‌పై ట్విట్టర్‌లో నారా లోకేష్ కామెంట్స్ చేయగా.. మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుందన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 9, 2023, 06:48 PM IST
Minister Roja: జైలుకు పంపించకుండా.. జైలర్ సినిమాకు పంపిస్తారా..? నారా లోకేష్‌కు మంత్రి రోజా కౌంటర్

Minister Roja Counter to Nara Lokesh: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో సీఎం జగన్‌పై వ్యాఖ్యలు చేశారు. "పిచ్చోడు లండన్‌కి.. మంచోడు జైలుకి.. ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదు.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు.. మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వేయడం సాధ్యం కాదు సైకో జగన్.." అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ కామెంట్స్‌కు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. 

పిల్ల సైకో అంటూ నారా లోకేష్‌పై ఫైర్ అయ్యారు. "మీ డాడీ.. కేడి కాబట్టే అరెస్ట్ అయ్యాడు పిల్ల సైకో నారా లోకేష్‌. మంచోడు కాదు సూట్ కేస్ కంపెనీలతో ముంచేసినోడు మీ చంద్రబాబు నాయుడు. మీ నాన్న కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాని జైలుకి పంపక జైలర్ సినిమాకి పంపిస్తారా..? పప్పు మీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే  ఈ కుంభకోణంలో విచారణ జరుపుకోండి అని అని ధైర్యంగా చెప్పు..!!" అని రోజా ట్వీట్ చేశారు. ఏ1 చంద్రబాబు నాయుడిని ఇక ఏ దేవుడు కాపాడలేడని అన్నారు. మీ తాత ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుందన్నారు.

 

"క్రైం నెంబర్ 29/2021 కింద అరెస్ట్ .. సీఆర్‌పీసీ 50(1)(2) సెక్షన్ కింద నోటీసులు.. 9/12/2021న సీఐడీ ఈఓడబ్ల్యూ వింగ్ ఎఫ్‌ఐఆర్ నమోదు, 120(B) నేరపూరితకుట్ర, సెక్షన్ 166,167 పబ్లిక్ సర్వెంట్ చట్టాన్ని ఉల్లంగించి నేరానికి పాల్పడటం, సెక్షన్ 418 తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం, ఐపీసీ సెక్షన్ 420 మోసం, చీటింగ్, నమ్మక ద్రోహం, ఐపీసీ సెక్షన్ 465, 468 ఉద్దేశపూర్వకంగా మోసంకోసం ఫోర్జరీ, 471 నకిలీ పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డు సృష్టించడం, సెక్షన్ 409 పబ్లిక్ సర్వెంట్ తన ఆధీనంలోని ఆస్థిని అక్రమంగా కట్టబెట్టడం, 12, 13(2) అవినీతికి పాల్పడటం, 13(1)(C)(D)పబ్లిక్ సర్వెంట్ అవినీతికి పాల్పడటం. ఇప్పుడు చెప్పండి.. చంద్రబాబును అరెస్ట్ ఎందుకు సమర్ధనీయం కాదు..?" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని ప్రశ్నించారు. భాజపాని మీ బావ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని అన్నారు. 

"ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్‌లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా  చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బీజేపీ దీనిని ఖండిస్తుంది.." అని అంతకుముందు పురంధేశ్వరి ట్వీట్ చేశారు. 

Also Read: IND vs PAK Dream11 Prediction Today Match: పాక్‌తో టీమిండియా బిగ్‌ఫైట్‌.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా..  

Also Read: Chandrababu Arrest Latest Updates: చంద్రబాబే ప్రధాన కుట్రదారు.. పదేళ్ల జైలు శిక్షకు అవకాశం: ఏపీ సీఐడీ చీఫ్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News