Nandyala Police Suspend: అల్లు అర్జున్ నంద్యాల పర్యాటన ఎఫెక్ట్‌.. ఇద్దరు పోలీసులపై వేటు.!

Nandyala Police Suspend: నంద్యాలలో హిరో అల్లు అర్జున్‌ పర్యాటన ఎఫెక్ట్‌ ఇద్దరు ఎస్‌బీ కానిస్టేబుల్‌పై వేటుకు కారణమైంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ కు మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్ ఈనెల 11న భారీ ర్యాలీ నిర్వహించారు.

Written by - Renuka Godugu | Last Updated : May 25, 2024, 10:42 AM IST
Nandyala Police Suspend: అల్లు అర్జున్ నంద్యాల పర్యాటన ఎఫెక్ట్‌.. ఇద్దరు పోలీసులపై వేటు.!

Nandyala Police Suspend: నంద్యాలలో హిరో అల్లు అర్జున్‌ పర్యాటన ఎఫెక్ట్‌ ఇద్దరు ఎస్‌బీ కానిస్టేబుల్‌పై వేటుకు కారణమైంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ కు మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్ ఈనెల 11న భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి ఎలాంటి అనుమతులు అల్లు అర్జున్‌ తీసుకోలేదు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే, ఆ సమయంలో సెక్షన్ 30, 144 లు అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించారు. ఇదే ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. పోలీసుల విఫలమే ఈ ర్యాలీకి కారణమని ఇద్దరు కానిస్టేబుల్‌లపై ఉన్నతాధికారులు వేటు వేశారు. అల్లు అర్జున్‌ ర్యాలీకి సంబంధించిన సమాచారన్ని పై అధికారులకు ఈ కానిస్టేబుల్స్‌ సమాచారం ఇవ్వడంలో విఫలం అయ్యారని ప్రధాన కారణంగా చెబుతున్నారు. అల్లు అర్జున్ పర్యాటన రాజకీయంగా కూడా చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: ఆ ఓటింగ్ శాతాలు బయటకొస్తే రచ్చే !

ఈ సందర్భంగా అల్లు అర్జున్ పర్యటనను కొందరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నంద్యాల ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులను బాధ్యుల్ని చేసి మరీ.. వారిపై శాఖపరమైన చర్యలు 60 రోజుల్లో తీసుకోవాలని కేంద్ర ఎన్నికలు కమిషన్ ఆదేశాలు జారీ చేస్తే.. తప్పంతా కానిస్టేబుళ్లదే అయినట్లు వారిపై మాత్రమే వేటు వేశారు. ఈనేపథ్యంలో టూటౌన్‌ ఎస్‌బీ కానిస్టేబుల్‌ స్వామి నాయక్, తాలుకా కానిస్టేబుల్‌ నాగరాజుపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఆ ఇద్దరినీ వీఆర్‌కు పంపారు. అయితే, అధికారులు తప్పించుకుని కేవలం కానిస్టేబుల్లపై వేటు వేశారని పోలీసు సిబ్బందిలో సందిగ్ధత కూడా నెలకొంది. 

ఇదీ చదవండి: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

ఎన్నికల సంఘం చర్యలు తీసుకోమన్నా నంద్యాల ఎస్పీ కె.రఘువీర్రెడ్డి, డీఎస్పీ ఎన్.రవీంద్రనాథ్రెడ్డి, సీఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా కేవలం కింది స్థాయి సిబ్బంది అయిన కానిస్టేబుల్లపై ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా పై స్థాయి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదుగానీ.. తొలివేటు మాత్రం ఎస్బీ కానిస్టేబుళ్లపై పడింది. ఈ నెల అంటే మే 13న దేశవ్యాప్తంగా నాలుగోదశ ఎన్నికలు ఎన్నికల కమిషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ తెలంగాణతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో లోక్‌ సభ ఎన్నికలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్నికల ముందు కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో హిరో అల్లు అర్జున్ మే 11న నంద్యాల పర్యటించి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవికి మద్ధతు తెలిపారు. దానికి ఆయన ఎటువంటి అనుమతి తీసుకోలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News