Narendra Modi Cabinet: నరేంద్ర మోడీ టీంలో తెలుగు రాష్ట్రాలకు ఏడు బెర్తులు..?

Modi Cabinet List:  ఈ రోజు ప్రధాన మంత్రిగా ప్రమాణ  స్వీకారం చేయబోతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  3వ కేబినేట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు బెర్తులు కన్ఫామ్ అయినట్టు సమాచారం. అందులో తెలంగాణ నుంచి మూడు.. ఏపీ నుంచి నలుగురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 9, 2024, 10:49 AM IST
Narendra Modi Cabinet: నరేంద్ర మోడీ టీంలో తెలుగు రాష్ట్రాలకు ఏడు బెర్తులు..?

Modi Cabinet List: ఈ రోజు సాయంత్రం ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధా మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రెండో ప్రధాన మంత్రిగా రికార్డులకు ఎక్కారు. మధ్యలో ఇందిరా గాంధీ, వాజ్ పేయ్ లు కూడా దేశానికి మూడు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేసినా.. కంటిన్యూగా ప్రధాని పీఠం అధిరోహించబోతున్నారు. ఈయన మంత్రి వర్గంలో దాదాపు 80 మంది క్యాబినేట్, స్వతంత్ర, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ దాదాపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమైంది. అటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోన్న కిషన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నట్టు ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి మంత్రిగా క్యాబినేట్ లో బెర్త్ వస్తుందా లేదా అనేది చూడాలి.

ఇంకోవైపు ఏపీ నుంచి పురంధేశ్వరి, కింజారపు రామ్మోహన్ నాయుడు, హరీష్ బాలయోగి, దగ్గుమళ్ల ప్రసాద్, పెమ్మసాని చంద్ర శేఖర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో పురంధేశ్వరి, రామ్మోహన్ నాయుడుకు బెర్త్ కన్ఫామ్ అనే మాట వినబడుతోంది. అటు కర్ణాటక నుంచి ప్రహ్లాద్ జోషి, బసవరాజ్ బొమ్మై, కుమారస్వామి, గోవంద్ కర్జోల్, పిసీ మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. అటు బిహార్ నుంచి జితన్ రామ్ మాంజీ (హెచ్ ఏఎం), లాలన్ సింగ్, సునీల్ కుమార్, కౌశలేంద్ర కుమార్, రామ్ నాథ్ ఠాకూర్, సంజయ్ ఝా వంటి వారు జేడీయూ తరుపున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అటు బీజేపీ తరుపున బిహార్ నుంచి రాజీవ్ ప్రతాప్ రూఢీ, సంజయ్ జైస్వాల్, నిత్యానందర్ రాయ్, ఎల్జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్ కు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జమ్మూ కశ్మీర్ నుంచి జితేంద్ర సింగ్, జుగల్ కిషోర్ శర్మ..ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్ నాథ్ సింగ్, అనుప్రియా పటేల్, జితన్ ప్రసాద్, జయంత్ చౌదరిలకు క్యాబినేట్ బెర్త్ లు కన్పామ్ అయినట్టు ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట.

మహారాష్ట్ర నుంచి నితిన్ గడ్కరీ, ప్రతాప్ రావు జాదవ్, పీయూష్ గోయల్, మధ్య ప్రదేశ్ నుంచి శివరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియాలు ప్రమాణం చేయనున్నారు.

అటు ఒడిషా నుంచి ధర్మేంద్ర ప్రధాన్, మన్మోహన్ సమల్, రాజస్థాన్ నుంచి దుష్యంత్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, అసోం నుంచి సర్బానంద సోనోవాల్, బిలజులీ కలితా మేధీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కిరణ్ రిజుజు, బిప్లవ్ దేవ్ తరుపున బెంగాల్ నుంచి శంతను ఠాకూర్.. కేరళ నుంచి సురేష్ గోపీ, తమిళనాడు నాడు అన్నామలై, తమిళ సైలకు క్యాబినేట్ బెర్త్ దక్కే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా కీలమైన హోం, రక్షణ, ఆర్ధిక, విదేశాంగ శాఖల్లో ఆర్ధిక శాఖ మాత్రమే మార్పు ఉంటుందని సమాచారం. హోం శాఖ మంత్రిగా అమిత్ షా, రక్షణ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రిగా జై శంకర్ అదే శాఖల మంత్రులుగా కొనసాగనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News