సరికొత్త హామీ: 2 వేల ఫించన్ రూ.3 వేలకు పెంపు

ఎన్నికల దగ్గర పడుతున్న నేపధ్యంలో నేతల హామీ వర్షం ఎడతెరపిలేకుండా కురుస్తోంది. జగన్ ప్రకటించిన రవరత్నాలను ఒక్కక్కటిగా అమలు చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తుంటే..దీనికి ధీటుగా సరికొత్త హామీలు ఇస్తున్నారు జగన్. ఫించన్ లో ఏకంగా మూడు వేలకు పెంచుతానంటూ జగన్ హామీ ఇచ్చారు. తిరుపతిలో నిర్వహించిన ‘సమర శంఖారావం’లో ఆయన ఈ హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని.. ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని.. పిలుపు నిచ్చారు. ప్రతి ఓటరు ఓటు వేసేలా బూత్ కమిటీలు బాధ్యత తీసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లోనుకాకుండా చూసే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. 

Updated: Feb 6, 2019, 05:09 PM IST
సరికొత్త హామీ: 2 వేల ఫించన్ రూ.3 వేలకు పెంపు

ఎన్నికల దగ్గర పడుతున్న నేపధ్యంలో నేతల హామీ వర్షం ఎడతెరపిలేకుండా కురుస్తోంది. జగన్ ప్రకటించిన రవరత్నాలను ఒక్కక్కటిగా అమలు చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తుంటే..దీనికి ధీటుగా సరికొత్త హామీలు ఇస్తున్నారు జగన్. ఫించన్ లో ఏకంగా మూడు వేలకు పెంచుతానంటూ జగన్ హామీ ఇచ్చారు. తిరుపతిలో నిర్వహించిన ‘సమర శంఖారావం’లో ఆయన ఈ హామీ ఇచ్చారు.

ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్..
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని.. ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని.. పిలుపు నిచ్చారు. ప్రతి ఓటరు ఓటు వేసేలా బూత్ కమిటీలు బాధ్యత తీసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లోనుకాకుండా చూసే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. 

Tags: