Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..

Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 4, 2024, 10:25 AM IST
Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..

Pawan Kalyan Tour: అవును పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి .. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు  స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడు మీదున్నారు. తాజాగా చాలా రోజుల తర్వాత సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. అక్కడ  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అక్కడ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.

Add Zee News as a Preferred Source

అనంతరం జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. కూటమి నాయకుల్లో భేటీ అవుతారు. కూటమిలో కొట్లాటల నేపథ్యంలో పవన్‌ సమావేశానికి సర్వత్రా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలోనే  రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పవన్‌ సూచనలు చేయనున్నారు.  

సార్వత్రిక ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూటమి నాయకుల మధ్య విభేదాలు పెరిగాయి. ఇరుపక్షాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే మంటపుడుతోంది. రెండు రోజుల క్రితం కూటమి నాయకులతో ఎమ్మెల్సీ అభ్యర్ధి నిర్వహించిన సమావేశం రసాభాస అయింది. ఇక్కడ ఇరుపార్టీల మధ్య ఆధిపత్యపోరు ఉధృతంగా మారింది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. సినిమాలు చేస్తున్నారు. ఓవైపు హరి హర వీరమల్లు సినిమాతో పాటు ‘ఓజీ’ సినిమాలు చేస్తున్నారు.ఈ సినిమాలు వచ్చే యేడాది మూడు సినిమాలు విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News