PM Modi AP Tour: నేడు ప్రధాని మోదీ ఏపీ పర్యటన, లేపాక్షి సందర్శన, నాసిన్ ప్రారంభం

PM Modi AP Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్లలో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సంస్థను మోదీ ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2024, 09:26 AM IST
PM Modi AP Tour: నేడు ప్రధాని మోదీ ఏపీ పర్యటన, లేపాక్షి సందర్శన, నాసిన్ ప్రారంభం

PM Modi AP Tour: రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్స్ అండ్ నార్కోటిక్స్ సంస్థ ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఏపీ పర్యటన సందర్భంగా సుప్రసిద్ధ లేపాక్షి ఆలయాన్ని మోదీ సందర్శించనున్నారు. 

ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. మద్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగుళూరు చేరుకుని అక్కడ్నించి హెలీకాప్టర్ ద్వారా నేరుగా లేపాక్షికి చేరుకుంటారు. మద్యాహ్నం 2 గంటలకు లేపాక్షి ఆలయాన్ని, శిల్పకళా సంపదను తిలకించనున్నారు. ఆ తరువాత నేరుగా హెలీకాప్టర్ ద్వారా నాసిన్ ప్రాంగణానికి చేరుకుంటారు. నాసిన్ అంటే National Academy of Customs, Indirect Taxes and Narcotics. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ సంస్థను ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాకు కేటాయించారు. ఇప్పటి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో ఈ సంస్థను పూర్తి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి కడప చేరుకుంటారు. అక్కడ్నించి హెలీకాప్టర్ ద్వారా మద్యాహ్నం 2 గంటలకు నాసిన్ కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్‌తో పాటు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ సైతం పాల్గొననున్నారు. 

మోదీ ఏపీ పర్యటన మొత్తం ప్రధాని కార్యాలయం చూసుకుంటుంది. మోదీ పర్యటనకు ఎక్కడా మీడియాకు అనుమతి లేదు. లేపాక్షి, నాసిన్ పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఆర్ఎస్, కస్టమ్స్ అధికారులకు నాసిన్ కేంద్రంలోనే ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. 

Also read: Supreme Court: ఇవాళ తేలనున్న చంద్రబాబు భవితవ్యం, క్వాష్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News