Radhe Shyam: షాకింగ్.. ప్రభాస్ ఫ్యాన్ ఆత్మహత్య.. రాధేశ్యామ్ డివైడ్‌ టాక్‌తో మనస్తాపం..

Prabhas fan Suicide as Radhe Shyam gets divide talk:  రాధేశ్యామ్ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో తట్టుకోలేకపోయిన ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 10:11 PM IST
  • ప్రభాస్ ఫ్యాన్ ఆత్మహత్య
  • రాధేశ్యామ్ సినిమాకు డివైడ్ టాక్‌తో మనస్తాపం
  • ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రభాస్ ఫ్యాన్
Radhe Shyam: షాకింగ్.. ప్రభాస్ ఫ్యాన్ ఆత్మహత్య.. రాధేశ్యామ్ డివైడ్‌ టాక్‌తో మనస్తాపం..

Prabhas fan Suicide as Radhe Shyam gets divide talk: కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. రవితేజ (24) అనే ప్రభాస్ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం విడుదలైన ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాకు డివైడ్ టాక్ రావడంతో రవితేజ తట్టుకోలేకపోయాడు. తన అభిమాన నటుడి సినిమాకు ఇలాంటి టాక్ రావడంతో మనస్తాపం చెందాడు. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. కర్నూలులోని తిలక్‌ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.  హీరోలంటే అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ ఇలా ప్రాణాలు తీసుకోవడమేంటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా డివైడ్ తెచ్చుకుంది. అభిమానులకు సినిమా బాగా నచ్చినప్పటికీ అక్కడక్కడా నెగటివ్ టాక్ వినిపిస్తోంది. మరోవైపు, టాక్‌తో సంబంధం లేకుండా రాధేశ్యామ్ వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. తొలి రోజు బాక్సాఫీస్ వదద్ రూ.43.1 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఒక్క తెలుగులోనే రూ.37.91 కోట్లు వసూలు చేసింది. హిందీలో రూ.4.8 కోట్లు, తమిళంలో రూ.35 లక్షలు, మలయాళంలో రూ. 4 లక్షల వసూళ్లు రాబట్టింది.

1970లో జరిగే పీరియాడికల్ స్టోరీతో రాధేశ్యామ్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ ఏడాది జనవరిలోనే రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు గత శుక్రవారం (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డివైడ్ అందుకుంది. 

Also read: RRR Crazy Update: డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ కానున్న తొలి భారతీయ సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్‌

Also read: Radheshyam Collections: ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్ లలో పుష్ప, భీమ్లానాయక్‌ లను దాటేసాడా..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News