10 Feet Python Rescued from Anakapalle: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో కొండచిలువ కలకలం సృష్టించింది. అనకాపల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వి.మాడుగుల మండలం కోమటి వీదిలో 10 అడుగుల కొండచిలువ హల్చల్ చేసింది. ఓ ఇంట్లోకి చొరబడి పెంపుడు కోళ్లను చంపేసింది. భారీ కొండచిలువను చూసి ఆ ఇంట్లోని వారు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో.. పామును బందించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కోమటి వీదిలోని స్థానిక పుట్టా హనుమంతురావు ఇంటిలో పెంపుడు కోళ్లు ఉన్నాయి. ఇది గ్రహించిన కొండచిలువ వాటిని తినేందుకు ఇంటి ఆవరణలోకి వెళ్ళింది. కోళ్లు ఉన్న గదిలో చొరబడింది. ఆ గదిలో వస్తువులు కిందపడడంతో పెద్దగా శబ్దం వచ్చింది. ఇది విన్న హనుమంతురావు రూమ్ తలుపులు తీసేసరికే 10 అడుగుల కొండచిలువ ఉంది. దాన్ని చూసిన ఆయన భయాందోళనకు గురయ్యాడు. కుటుంబసభ్యులు స్దానికంగా యున్న స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం ఇచ్చారు.
అనకాపల్లిలో 10 అడుగుల కొండచిలువ హల్చల్! pic.twitter.com/EKNRcHKHtt
— Penthalasampath (@Penthalasampath) October 13, 2022
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వెంకటేష్ వెంటనే హనుమంతురావు ఇంటికి వచ్చాడు. వెంకటేష్ కొండచిలువను పట్టుకోవడానికి అరగంట శ్రమించాడు. చివరకు మోరీలో దూరిన దాన్ని పట్టుకుని.. నీటితో శుభ్రం చేసి సంచిలో బంధించాడు. దాంతో కోమటి వీది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పామును చూడడానికి స్థానిక ప్రజలు గుంపులుగా వచ్చారు. కొండచిలువకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Also Read: India Asia Cup Final: మెరిసిన షఫాలీ, దీప్తి.. ఆసియా కప్ 2022 ఫైనల్ చేరిన భారత్!
Also Read: పాకిస్తాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవదహనం! వరదలు వదిలేసినా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook